అక్కడ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి.. దేశంలోనే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైకమార్గం వ్యాక్సినేషన్ ఒకటే.. కానీ, వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి.. పట్టణాలు, నగరాలు కూడా వీటికి మినహాయింపు కాదు.. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, వ్యాక్సిన్ అంటేనే నాకు వద్దు బాబోయ్ అనేవారు ఉన్నారు.. కానీ, ఓ మారుమూల గ్రామంలో.. వందకు వందశాతం మంది వ్యాక్సిన్ తీసుకుని రికార్డు కెక్కారు.. ఈ అరుదైన ఘనత సాధించింది జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా వేయాన్ గ్రామం.. అక్కడ 18 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేశారు… బందిపోరా జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్లు దూరంలో ఉండే ఈ గ్రామానికి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు.. ఆ గ్రామానికి చేరాలంటే ఏకంగా 18 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి.. అయినా.. ఆరోగ్యసిబ్బంది కృషితో.. వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేశారు.. దేశంలోనే తొలిసారి వేయాన్ గ్రామం 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే, ఆ గ్రామంలో 18 ఏళ్ల పైబడినవారు మొత్తం 362 మంది ఉన్నారు.. వీరు పశువుల మేత కోసం నిత్యం వేరే ప్రాంతాలకు సంచరిస్తూ ఉంటారు.. మారు మూల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి వ్యాక్సినేషన్‌పై సరైన అవగాహన లేకపోయినా.. వైద్యాధికారులు, సిబ్బంది కృషితో.. ఆ ప్రక్రియ పూర్తిచేసినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ప్రస్తుతం 18 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాని సంగతి తెలిసిందే..
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!