తెలుగు సినీ అభిమానులే కాదు… యావత్ భారతదేశంలోని సినిమా అభిమానులు మార్చి నెల కోసం ఎంతగానో ఎదురుచూశారు. కొన్నేళ్ళుగా వాళ్లు భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా సినిమాలు ఈ నెలలో విడుదల కాబోతుండమే అందుకు కారణం. అయితే కారణాలు ఏవైనా ఆ సినిమాలు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. మార్చి నెలలో తెలుగులో మొత్తం 18 సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రయిట్ సినిమాలు 13 కాగా, 5 డబ్బింగ్ మూవీస్. ఈ నెల ప్రారంభమే తమిళ…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఇక ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు…
పునీత్ రాజ్ కుమార్ – ఈ పేరు వినగానే కన్నడ జనాల్లో ఓ ఆనందతరంగం ఎగసి పడుతుంది. పునీత్ చురుకైన అభినయం చూసి ముగ్ధులై పోయిన జనం, ఆయన మానవత్వాన్ని తెలుసుకొని మరింత అభిమానం పెంచుకున్నారు. సదా మోముపై చిరునవ్వులతో కనిపించిన పునీత్ అభిమానులను శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు. కానీ, ఆయన నవ్వు మాత్రం అభిమానుల హృదయాల్లో నిలచే ఉంది. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకే వినియోగించే ఆ మంచి మనిషి ఇక రాడని…
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డేకి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు…
గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక స్టార్ గా ఎదిగినప్పటికీ ఆయన ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్ కు అశేషాభిమానాన్ని సంపాదించి పెట్టింది. కాగా పునీత్ చివరి చిత్రం “జేమ్స్” మార్చి 17న ఆయన జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతోంది. టాలీవుడ్ నటులలో ఎన్టీఆర్, పునీత్ కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు…
దక్షిణాదిలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటైన “జేమ్స్” చిత్రంతో దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరిసారిగా బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం “జేమ్స్” మూవీ టీజర్‌ను మేకర్స్ నిన్న ఆవిష్కరించారు. ఇందులో పునీత్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆయన అభిమానులకు అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించారు మేకర్స్. ఇక ఈ సందర్భంగా ప్రభాస్ సోషల్ మీడియాలో పునీత్ ను తలచుకుంటూ ఎమోషనల్…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ “జేమ్స్” విడుదలకు సిద్ధమవుతోంది. పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17న సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు పునీత్ లేకపోవడంతో ఆయన పాత్ర డబ్బింగ్ విషయం ఆసక్తికరంగా మారింది. పునీత్ డబ్బింగ్ మినహా సినిమా పనులన్నీ పూర్తయ్యాయి. పునీత్‌కి డబ్బింగ్ చెప్పడానికి తగిన వాయిస్ కోసం మేకర్స్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. చివరకు పునీత్ అన్నయ్య శివరాజ్‌కుమార్‌తో డబ్బింగ్ చెప్పించడానికి మొగ్గు చూపారు.…
రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల జాబితాలో సెలెబ్రిటీలు వరుసగా చేరిపోతున్నారు. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి రెండవసారి పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించగా, తాజాగా మరో యంగ్ హీరో కోవిడ్ పాజిటివ్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇటీవలే ‘అఖండ’లో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించిన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేకా ఈరోజు కోవిడ్-19 బారిన పడ్డారు. Read Also : పవర్ స్టార్ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల షాకింగ్ డెసిషన్ ఈ విషయాన్ని శ్రీకాంత్…
దివంగత కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం “జేమ్స్”. పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ నేసథ్యంలో కన్నడ డిస్ట్రిబ్యూటర్లు పునీత్ కోసం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. “జేమ్స్” విడుదలైన వారం వరకు మరే ఇతర చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారట. కర్ణాటక చలనచిత్ర పంపిణీదారులు పునీత్ చివరి చిత్రాన్ని అభిమానులకు మరింత ప్రత్యేకం చేయడానికే ఈ నిర్ణయం…