జల్లికట్టు ఎద్దుకు బలవంతంగా తినిపిస్తున్నట్లు చూపించిన వీడియోపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతేాకాకుండా ఆ వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను సేలం జిల్లా చిన్నప్పంపట్టిలో చిత్రీకరించారు. కాగా ఈ వీడియోలో ఒక ఎద్దుకు నోటిలో కోడిని పెట్టి నమలమని బలవంతం చేశారు. అంతేకాకుండా.. ముగ్గురు వ్యక్తులు ఎద్దును గట్టిగా పట్టుకోగా, ఒకరు కోడిని నోటిలో పెట్టడం లాంటివి చేశారు.