దేశంలోని నదుల అనుసంధానంపై కసరత్తును కేంద్రం వేగవంతం చేసింది. గోదావరి-కావేరి నదులను లింక్ చేసేందుకు…ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే…ఐదు రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలు తీసుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నదుల అనుసంధానం ద్వారా నదీజలాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న నదుల అనుసంధానంపై కేంద్రం దృష్టి పెంచింది. దీనిపై ఈ నెల 18న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ,…