Adipurush: జగతికే ధర్మ దీపం.. నిండైన నీ విగ్రహం.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వివాదాలు అయినా కూడా మంచి గుర్తింపును అయితే తెచ్చుకున్నాయి. ఇక ఈ చిత్రంలోని జై శ్రీరామ్ సాంగ్ అయితే.. నిత్యం గుడిలో ప్లే చేసేలా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. కొన్నిరోజుల క్రితం ఈ సాంగ్ ఆడియోను రిలీజ్ చేయగా.. తాజాగా వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసి అభినులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.
సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. సాంగ్ వింటుంటే.. రాముడి స్మరణతో మనసంత నిండిపోతుంది అని చెప్పొచ్చు.
Manchu Manoj: ఏందీ బ్రో.. ‘వాట్ ది ఫిష్’.. అర్ధం కానట్లే ఉంది
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
‘ఎవరు ఎదురు రాగలరు మీ దారికి ఎవరికి ఉంది ఆ ఆధికారం పర్వత పాదాలు వణికి కదుల్తాయ్ మీ హుంకారానికి’ అంటూ రాముడు చెప్పే డైలాగ్ తో మొదలైన ఈ సాంగ్.. గూస్ బంప్స్ తెప్పిస్తుంది. “నీ సాయం.. సదా మేము ఉన్నాం.. సిద్ధం సర్వ సైన్యం. సహచరులై పదా వస్తున్నాం.. సఫలం .. స్వామి కార్యం” అంటూ సాగిన ఈ పాట ఎంతో అద్భుతంగా వినసొంపుగా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ అయితే ఆయనకు చేతులు ఎత్తి దండం పెట్టేలా ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక అజయ్ – అతుల్ సంగీతం వేరే ట్రాన్స్ లోకి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. సీతను తీసుకురావడానికి రాముడికి వానర సైన్యం చేసిన సహాయం.. వారికి అండగా దైర్యం చెప్తున్నా రాముడు.. తన రాఘవుడు కోసం అశోకవనంలో ఒంటరిగా ఎదురుచూస్తున్న సీత.. రాముడి కోసం ఏదైనా చేసే హనుమంతుడు.. ఇలా మొత్తం విజువల్స్ ను ఈ సాంగ్ లో చూపించేశారు. ముఖ్యంగా సీత కోసం ఎడబాటులో ఉన్న రాముడు లుక్ అయితే ఆకట్టుకొంటుంది. చిన్నగా గడ్డం.. ఆ చూపులు.. ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక విఎఫ్ ఎక్స్ ను కూడా ఈసారి బాగానే చూపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!