కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. సూర్యకు సపోర్ట్ గా #WeStandWithSuriya అనే ట్యాగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది. సూర్య హీరోగా, జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన “జై భీమ్” సినిమా అక్టోబర్ 2న విడుదలై అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోయింది. ఇటీవల సినిమాలో మతపరమైన చిహ్నాన్ని కలిగి ఉన్న సన్నివేశంపై ప్రేక్షకులలో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మేకర్స్ సన్నివేశాన్ని మార్చినప్పటికీ క్యాలెండర్ వివాదం సద్దుమణగలేదు సరికదా ఇప్పుడు…
సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో టి.సి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై బీమ్’. ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా చూసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో పాటు రాజకీయ నేతలు, పలువురు సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విభిన్నమైన స్క్రీన్ రివ్యూలతో ఈ చిత్రం వినోదాన్ని పంచుతుంది. తాజాగా మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లిజో మోల్ జోస్, మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన కోర్ట్ డ్రామా ‘జై భీమ్’. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రేక్షకుల నుంచి సెలెబ్రిటీల దాకా ఈ సినిమాకు జై కొడుతున్నారు. ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుని హాలీవుడ్ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇప్పటి వరకూ ఐఎండిబిలో మొదటి స్థానంలో ఉన్న కల్ట్ క్లాసిక్ ‘ది షాశాంక్ రిడంప్షన్’ను…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్న ‘జై భీమ్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో సూర్య యాక్టింగ్, ఆ కథ వెరసి ఆ సినిమాను ఊహించలేనంత విజయాన్ని అందుకునేలా చేశాయి. అయితే దీనిపై ఒక పక్క వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడా సూర్య జంకడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక కథను సూర్య ఎంచుకోవడం.. దానిని ఆయనే స్వయంగా నిర్మించడం పెద్ద రిస్క్ తో కూడుకున్న పని.…
పేదవాడైనా.. ధనవంతుడైనా తనకు న్యాయం కోసం కోర్టుల వైపే చూస్తారు. అందరికీ న్యాయం దక్కాలనేదే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అలాంటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా జై భీమ్… తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం మార్మోగిపోతోంది. అందులో అన్యాయంగా అమాయకుడిపై కేసులు మోపి.. జైల్లో చిత్ర హింసలు ఎలా పెడతారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన “జై భీమ్” సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కులం లాంటి సీరియస్ సబ్జెక్ట్ తో, అణగారిన వర్గాలపై పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై తెరకెక్కిన ఈ సినిమాపై కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి అన్బుమణి రాందాస్. “జై భీమ్” సినిమాపై రాందాస్ చేసిన ఆరోపణలన్నింటికీ సూర్య తాజాగా సమాధానమిచ్చారు. నవంబర్ 11న సూర్య తన ట్విట్టర్ ఖాతా నుంచి రాందాస్…
జైభీమ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది.కమర్షియల్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టు కుంటుంది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు దక్కిం చుకున్న మొదటి తమిళ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రం పై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించి ప్రశసించాడు. ఏది ఏమైనా ఈ చిత్రం టాప్250 చిత్రాల సరసన చోటు దక్కించుకోవడం మాములు విష యం కాదని వేరే చెప్పనక్కర లేదు. కేవలం మౌత్ పబ్లిసీటీతోనే…
నవంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సూర్య ‘జై భీమ్’ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సినిమా చూసిన వాళ్ళంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు. థియేటర్లలో రిలీజ్ చేయాల్సిన మంచి చిత్రాన్ని సూర్య ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశారని కొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. సూర్య అభిమానులు మాత్రమే కాకుండా, మంచి సినిమాను ప్రేమించే అందరూ ‘జై భీమ్’ చిత్రాన్ని సొంతం చేసుకుని విశేష ప్రచారం…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లాయర్ గా నటించిన సినిమా ‘జై భీమ్’. ఈ లీగల్ డ్రామాను టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 2న విడుదలైన ఈ సినిమాపై ఒకవైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తి చెంప పగలగొట్టే సీన్.…
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన తాజా చిత్రం “జై భీమ్”. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరిని ఫిదా చేసేస్తోంది. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సమాజంలో అణగారిన వర్గాలపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కొందరు పెద్ద మనుషులు చేస్తున్న దారుణమైన పనుల గురించి చూపించారు. మంచి సామాజిక…