2021 ఏడాది ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది కూడా కరోనాతో కాస్త కష్టంగానే సాగిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు సహా అన్నీ మూతపడడం, కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ వంటి సమస్యలతో సినీ ప్రియులకు ఈ సంవత్సరం కాస్త నిరాశగానే సాగింది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో మాత్రం పెద్ద సినిమాలు విడుదలవడంతో కొంచం ఊరట కలిగింది. ఇక డిసెంబర్ లో అయితే ఏకంగా సినిమాల పండగే ఉంది. పెద్ద సినిమాలన్నీ…
కోలీవుడ్ స్టార్ హీరో నటించిన “జై భీమ్” చిత్రం సృష్టించిన సంచలనం, రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ప్రశంసలతో పాటు సినిమాపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్నియార్ వర్గాన్ని కించపరిచారంటూ సూర్యను చంపేస్తామని బెదిరించారు కూడా. అయితే “జై భీమ్” మాత్రం వాటన్నింటినీ దాటేసి ఏకంగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ కు నామినేట్ అవ్వడం విశేషం. అయితే ఇప్పడు ‘జై భీమ్’ మరోసారి ట్రెండ్ అవ్వడానికి కారణం అది కాదు. ఓ మహానాయకుడిని…
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సూర్య చిత్రం “జై భీమ్” విడుదలైనప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అవి ప్రశంసలైనా, వివాదాలైనా ‘జై భీమ్’ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా మరో అరుదైన ఫీట్ సాధించింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ చిత్రం ఇచ్చిన సందేశం రాష్ట్రవ్యాప్తంగా వివాదాలకు నెలవు కాగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ చిత్రం అధికారికంగా…
చూస్తుండగానే ఈ యేడాది చివరి నెల డిసెంబర్ లోకి వచ్చేస్తున్నాం. అయితే… కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ నెలలోనే టాలీవుడ్ లో అత్యధికంగా 30 చిత్రాలు విడుదలయ్యాయి. అంటే సగటున రోజుకు ఒక సినిమా విడుదలైంది. అందులో స్ట్రయిట్, డైరెక్ట్ ఓటీటీ, డబ్బింగ్ సినిమాలూ ఉన్నాయి. ఈ నెల ప్రారంభమే సూర్య నటించిన అనువాద చిత్రం ‘జై భీమ్’తో మొదలైంది. గిరిజనుల గోడుకు అర్థం పట్టే ఈ సినిమాలో మానవహక్కుల లాయర్ గా సూర్య నటించాడు.…
ప్రముఖ నటుడు సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం విడుదలైనప్పటి నుండి వివాదంలో ఉంది. ఈ సినిమా ద్వారా వన్నియార్ సంఘం పరువు తీసే ప్రయత్నం చేశారని, సదరు వర్గాన్ని కించపరిచారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది తప్ప ఇంకా చల్లారడం లేదు. తాజాగా #SuriyaHatesVanniyars అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీని ద్వారా వన్నియార్ వర్గం ప్రజలు సూర్యపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. సూర్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ…
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిన చిత్రం ‘జై భీమ్’. మణికందన్, లిజోమోల్ జోస్, రజిషా విజయన్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా విశేష ఆదరణను దక్కించుకుంటోంది. ప్రేక్షకులు, విమర్శకులతో పాటు తమిళనాడు సీఎం సహా పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐఎండిబిలో ఈ చిత్రం…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. 28 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందిన ‘జై భీమ్’ సినిమా అందరి మనసులను కదిలించిన ‘చినతల్లి’ పాత్ర అసలు పేరు పార్వతి. ఆమె ఇప్పటికీ సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య పార్వతికి…
కోలీవుడ్ హీరో సూర్య నటించిన “జై భీమ్” చిత్రం వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 15న వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అంటూ ‘జై భీమ్’ చిత్రబృందం సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం లీగల్ నోటీసు పంపింది. దీని తరువాత సూర్యకు అనేక బెదిరింపులు రావడంతో ఆయనకు పోలీసులు భద్రతను కల్పించారు. ప్రస్తుతం తమిళనాడు, టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద ఐదుగురు పోలీసులు ఆయుధాలతో సూర్యకు…
ప్రకాశ్ రాజ్ వారం పాటు మౌనవ్రతం లో ఉండబోతున్నారు. ఇదేదో ఆయన ఎవరిమీదో నిరసనతో చేస్తున్నది మాత్రం కాదు! ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన ప్రకాశ్ రాజ్ ఎందుకైనా మంచిదని కంప్లీట్ బాడీ చెకప్ చేయించారట. అంతా బాగుందని డాక్టర్లు చెప్పారట. అయితే వోకల్ కార్డ్స్ కు వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సలహా ఇచ్చారట. అందుకోసమే ‘మౌనవ్రతం’ పాటించబోతున్నానని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రతి విషయం మీద తన స్పందనను…
సినిమాపై కొందరు బెదిరింపు రాజకీయాలు చేయాలనీ చూస్తున్నారా ? అంటే… కోలీవుడ్ లో తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. చిన్న చిన్న కారణాలతో సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం, నటులను కొడితే రివార్డులు అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం, దాడులు చేస్తామంటూ బెదిరించడం ఆందోళనకరంగా మారింది. సినిమాను సినిమాలాగే చూడకుండా ఇందులో కూడా రాజకీయాలు చేస్తున్న కొందరు వ్యక్తులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం, ప్రభుత్వాలు ఈ తతంగాన్ని అంతా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం దారుణం.…