గత యేడాది ఎయిర్ డెక్కన్ అధినేత జి. ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరారై పొట్రు’ చిత్రాన్ని చేసిన తమిళ స్టార్ హీరో సూర్య, ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన మానవ హక్కుల న్యాయవాది చంద్రు స్ఫూర్తితో ‘జై భీమ్’ చిత్రాన్ని చేశారు. లివింగ్ లెజెండ్స్ అయిన వీరిరువురి పాత్రలను పోషించడానికి సూర్య ముందుకు కావడం ఒక ఎత్తు అయితే, ఆ చిత్రాలను తనే స్వయంగా నిర్మించడం మరో ఎత్తు. ‘సూరారై పొట్రు’ గత యేడాది దీపావళికి…
ఈ వారం ఓటిటిలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు టాప్ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్ కాబోతున్నాయి. నవంబర్ 4న దీపావళి ఉండగా, ఈ వారంలో విడుదల కానున్న సినిమాలు ఓటిటి ప్రియులకు మంచి ట్రీట్ కానున్నాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఓటిటిలో విడుదల కానున్నాయి తెలుసుకుందాం. జై భీమ్ఈ ఇంటెన్సివ్ డ్రామాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది ‘జై భీమ్’. సామాజిక సందేశంతో…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లోను అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తమిళ్, తెలుగులోను విడుదల అవుతాయి. ఇక ఇటీవల ఆకాశం నీ హద్దురా చిత్రం అమెజాన్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అన్ని చిత్రాలు ఓటిటీ బాట పట్టిన విషయం తెల్సిందే. అందులో సూర్య- జ్యోతిక నిర్మించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే జ్యోతిక నటించిన రక్త సంబంధం అమెజాన్ లో విడుదలై మెప్పించింది.…
సీనియర్ తమిళ నటుడు శివకుమార్ తనయుడు సూర్య నటుడిగా ‘నంద’ సినిమాతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001లో విడుదలైన ఆ సినిమాకు దర్శకుడు బాలా. ఆ తర్వాత మూడేళ్ళకు బాలా దర్శకత్వంలోనే సూర్య ‘పితామగన్’ చిత్రంలో విక్రమ్ తో కలిసి నటించాడు. ఈ సినిమా కూడా అతనికి నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. ఇక విశాల్, ఆర్య హీరోలుగా బాలా తెరకెక్కించిన ‘అవన్ ఎవన్’ సినిమాలో సూర్య గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. బాలాతో ఉన్న రెండు దశాబ్దాల…
సూర్య లాయర్ గా నటిస్తున్న సినిమా ‘జై భీమ్’. ఈ లీగల్ డ్రామాను టి. జె. జ్ఞానవేల్ దర్వకత్వంలో సూర్య, జ్యోతిక కలిసి తమ 2డీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా నవంబర్ 2న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలలో ట్రైలర్ ను విడుదల చేశారు. తాజా సూర్య హిందీ వర్షన్ ట్రైలర్ లింక్ ను సోమవారం తన సోషల్…
‘చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. ఉండటానికి భూమి, కనీస ఆహారాన్ని పొందడానికి రేషన్ కార్డు, ఓటర్ల లిస్టులో పేరులేని గిరిజనులను తప్పుడు కేసుల్లో పోలీసులు ఇరికించినప్పుడు వారి తరఫున పోరాటం చేసే న్యాయవాదిగా సూర్య ఇందులో నటించారు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన లాయర్ పాత్రను రావు రమేశ్ పోషించగా, పోలీస్ అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ గత యేడాది కరోనా టైమ్ లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. అదే సినిమాను ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ చేసి ఒకేసారి విడుదల చేశారు. ప్రస్తుతం సూర్య పలు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘జై భీమ్’. ఇది సూర్య నటిస్తున్న 39వ చిత్రం. టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్య, తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ 2డీ…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల అయ్యేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 39వ చిత్రంగా వస్తున్న “జై భీమ్” సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం…
‘సూరరై పోట్రు’తో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన సూర్య మంచి జోష్ లో ఉన్నాడు. కెరీర్ మొదట్నుంచీ ప్రయోగాలకు సై అనే టాలెంటెడ్ హీరో ఈసారి గిరిజన మహిళలపై దృష్టి పెట్టాడట. ‘జై భీమ్’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమాలో 1993 నాటి యదార్థ సంఘటనలు తెరపై కనిపించబోతున్నాయట. చంద్రు అనే లాయర్ చేసిన న్యాయ పోరాటం, దాని వల్ల అమాయక, పేద గిరిజన మహిళలకు కలిగిన లాభం సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారట. ‘సూరరై పోట్రు’ కూడా…
ప్రముఖ తమిళ నటుడు సూర్య 39వ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ అతని పుట్టిన రోజు సందర్భంగా వెలువడింది. సొంత బ్యానర్ 2 డి ఎంటర్ టైన్ మెంట్ లో టి. జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నిర్మిస్తున్న చిత్రానికి ‘జై భీమ్’ అనే పేరును ఖరారు చేశారు. రాజీషా విజయన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా కనిపిస్తుండటం విశేషం. సమాజంలో అట్టడుగు వర్గానికి చెందిన గిరిజనుల హక్కులకై న్యాయపోరాటం చేసే వకీల్…