నిన్నమొన్నటి వరకు వారిద్దరూ ప్రత్యర్థులు. ఇప్పుడు ఒకే గూటిలో ఉన్నారు. చేరికలు సంతోషాన్నిచ్చినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం టెన్షన్ పడుతున్నారట. పరిస్థితిని గమనించిన కేడర్.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడగలవా లేదా అని చర్చించుకుంటోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథ? టెన్షన్‌లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్? ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎల్ రమణ.. టీ టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడంతో జగిత్యాల నియోజకవర్గంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. రమణకు టీఆర్‌ఎస్ కండువా కప్పిన…