Jagjit Singh Dallewal: సీనియర్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ 131 రోజుల తర్వాత ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరలపై (MSP) చట్టపరమైన హామీని, రైతులు లేవనెత్తిన ఇతర అంశాలను డిమాండ్ చేస్తూ ఆయన గత ఏడాది నవంబర్ 26న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆదివారం రోజున ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో జరిగిన కిసాన్ మహాపంచాయత్‌లో జరిగిన రైతులు సమావేశంలో నిరాహార దీక్ష విరమించే నిర్ణయాన్ని ప్రకటించారు.
Farmers Protest : తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సంయుక్త కిసాన్ మోర్చా (SKM), రెండు నిరసన రైతు సంఘాల మధ్య శనివారం సమావేశం జరిగింది.
Jagjit Singh Dallewal: రైతు నాయకుడు జగ్లీత్ దల్లెవాల్ నిరాహార దీక్ష విరమించాలని పంజాబ్ బీజేపీ అకల్ తఖ్త్‌కి విజ్ఞప్తి చేసింది. పంటలకు చట్టబద్ధమైన ఎంఎంస్‌పీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన ఆమరణ నిరాహార దీక్ష 46వ రోజుకు చేరుకుంది. అయితే, తాను నిరాహార దీక్ష విరమించాలనుకుంటే బీజేపీ నేతలు అకల్ తఖ్త్‌ని కాకుండా, ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని శుక్రవారం కోరారు.
Dallewal Health Update: పంజాబ్- హర్యానా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష (70) ఈరోజు (జనవరి 6) 42వ రోజుకు చేరుకుంది. దల్లేవాల్ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఆయన సారథ్యంలోని సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆందోళన చెందుతుంది.
దల్లేవాల్కు వైద్యం అందించడానికి వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయి.. కనీసం ఐవీ ఫ్లూయిడ్స్‌నైనా ఇవ్వడానికి అవకాశం రావడం లేదని సుప్రీంకోర్టు ముందు పంజాబ్ ప్రభుత్వం నిస్సహాయత వ్యక్తం చేసింది. ప్రభుత్వం విన్నపం మేరకు కోర్టు మరో మూడు రోజుల గడువు ఇచ్చిందని పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ వెల్లడించారు.
PM Modi: పంటకు కనీస మద్దతు(ఎంఎస్‌పీ) చట్టంతో సహా 12 హామీలను అమలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ‘ఢిల్లీ ఛలో’ పేరుతో దేశ రాజధాని ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, వీరందరిని హర్యానా-ఢిల్లీ బోర్డర్‌లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. కేంద్రమంత్రులు, రైతు సంఘాల నేతలతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఆందోళన విరమణపై హామీ రాలేదు.
Farmers Protest: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో సహా 12 కీలక డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. ‘‘ఢిల్లీ ఛలో’’ పేరుతో దేశ రాజధానిని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ప్రయత్నాలను పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకుంటున్నాయి. హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతుల్ని, నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను వాడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలను ఉంచి రైతులు…