సిట్టింగ్ ఎమ్మెల్యేకి, మాజీ మంత్రికి మధ్య పంచాయితీని కాంగ్రెస్ అధిష్టానం తేల్చలేకపోతోందా? ఎంత నానిస్తే అంత బాగా తెగుతుందనుకుంటూ… మొదటికే మోసం తెచ్చుకుంటోందా? వాళ్ళిద్దరి మధ్య లొల్లిలో మంత్రులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఎవరా ఇద్దరు? వాళ్ళిద్దరి వివాదం ఎందుకు కొలిక్కి రావడం లేదు? కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే….. కాస్త అనేకంటే….. మరి కాస్త అనుకోవడమే కరెక్ట్. అదే పార్టీకి బలహీనతగా మారుతున్నా… సరిదిద్దలేని పరిస్థితి. రాజకీయ పార్టీలన్నాక ఎక్కడైనా నాయకుల…
Drunk Youth Attack Police: ఈ మధ్య తాగుబోతులు, మత్తుపదార్థాలు సేవించే వారి దారుణాలు మితి మీరుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో అర్ధరాత్రి తాగుబోతుల అల్లరి పెద్ద హంగామా సృష్టించింది. పట్టణంలోని తాళ్లచెరువు ప్రాంతంలో యువకులు మద్యం సేవిస్తూ అల్లరి చేస్తుండగా.. అక్కడి స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోర్ట్ సిబ్బంది కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డ్ జహీర్ సంఘటన స్థలానికి…
Iran-Israel : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. విద్య, ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన వారిపై ప్రభావం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణానికి చెందిన 57ఏళ్ల రెవెళ్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత…
Jeevan Reddy : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తన అభిప్రాయాలు వెల్లడించగానే, ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. “మా తాతలూ, తండ్రులూ కాంగ్రెస్‌లో ఉండేవారు అంటూ చెప్పేవారు. కానీ మీకు అనుకూలంగా పరిస్థితులు లేకపోతే తిరుగుబాటు చేసి పార్టీకి వ్యతిరేకంగా నడవడం నిజమైన సిద్ధాంతమా?” అంటూ ప్రశ్నించారు. “చొక్కారావు గారు కాంగ్రెస్‌ను…
Samagra Kutumba Survey: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రస్తుతానికి 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇకపోతే, ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా 27 రోజుల్లో 1,11,49,488…
Rahul Gandhi: ఢిల్లీలో మీకోసం పోరాడడానికి నేను సైనికుని లాగా ఉన్నానని రాహుల్ గాంధీ అన్నారు. జగిత్యాల కార్నర్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడుతూ.. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని.. రాహుల్ ఉంటున్న ఇల్లు తీసుకున్నారని మండిపడ్డారు.
Minister KTR: జగిత్యాల జిల్లాలో మాస్టర్ ప్లాన్ రైతులకు అన్యాయం జరగకుండా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో రాష్ట్రంలోనే అతిపెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ 4 వేల ఇండ్లతో నిర్మించామని తెలిపారు.
Jagityal : ప్రస్తుతం అంతా మనీ మామ. డబ్బు మోహంలో పడి కుటుంబ బంధాలను కాలరాస్తున్నారు. అలాంటిదే జగిత్యాలలో జరిగింది. కేవలం రెండు వందల కోసం తండ్రీ కొడుకును దారుణంగా హత్య చేశాడు.
జగిత్యాలలో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ తనకంటూ ఎవరు లేని జీవితం ఎందుకు అనుకుంది.. ఎవరికి భారం కాకూడదనుకుంది. కళ్లముందే కొడుకు, కోడలు మరణాన్ని చూసింది.. మనవడికి భారం కాకుండా తన దారిన తను వెళ్లిపోవాలనుకొని కఠినమైన నిర్ణయం తీసుకొంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమె.. ఆ మంచాన్నే తన చితిగా మార్చుకొంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మంచానికి నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.…