ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు చాలా బిజీగా వుంటారు. జగన్ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకుని వెళ్ళేందుకు వారు ప్రయత్నిస్తూనే వుంటారు. అందునా, రాబోయే రోజుల్లో మరింత విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వుంటుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు మాత్రం అన్నిటినీ పక్కన పెట్టారు. డ్యాన్స్ తో చిందేశారు. ఓ ప్రైవేట్ పార్టీలో స్నేహితులు, పార్టీ సన్నిహితులతో కలసి చిందులు వేసిన ఎమ్మెల్యే వీడియో వైరల్ అవుతోంది. మంత్రి పదవులు కోసం ఎమ్మెల్యేలు జగన్ ని ప్రసన్నం చేసుకునే పనిలో వుంటే.. పూతలపట్టు ఎమ్మెల్యే బాబు మాత్రం అనుభవించు రాజా అన్నట్టుగా డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు డ్యాన్స్ చేసి చిందులేసింది ఏ పాటకో తెలుసా… తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన..
నీపక్కన పడ్డాది లేదు చూడవె పిల్లా
నాదీ నక్కిలీసు గొలుసు
నీపక్కన పడ్డాది లేదు చూడవె పిల్లా
నాదీ నక్కిలీసు గొలుసు
హే….! నీపక్కన పడ్డాది లేదు చూడవె పిల్లా
నాదీ నక్కిలీసు గొలుసు
మీ బావగారు వచ్చేటి వేళ… ఆఆ
నాకు బంతిపూలు తెచ్చేటి వేళ.. ఆఆ
మీ బావగారు వచ్చేటి వేళ… ఆఆ
నాకు బంతిపూలు తెచ్చేటి వేళ.. ఆఆ అంటూ అనుచరులతో డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ ఏపీలో వైరల్ అవుతోంది.