జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని ఆర్దిక సంక్షోభం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. సీఎం జగన్ అహంభావం, చేతగానితనం, మొండితనంతోనే ఈ అనర్ధం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై ప్రభుత్వం నిజాలను తొక్కి పెడుతోంది. బహిరంగ మార్కెట్ రుణాలతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 3 ఏళ్లలో టీడీపీ హయాం కంటే రూ 86,865 కోట్లు అధికం.కేంద్ర నిధులు కూడా కలిపితే రాష్ట్ర…