AP Power Staff JAC: విద్యుత్ యాజమాన్యాలతో విద్యుత్ JAC నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.. దీంతో, పోరుబాటలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విద్యుత్ ఉద్యోగులు.. 13వ తేదీన ఛలో విజయవాడ, 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.. అయితే, సంవత్సరం నుంచి సాగుతున్న చర్చలు ఫలితం లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.. యాజమాన్యం కాలయాపన చేస్తోందని, సమస్యల పరిష్కారం వైపు రావడం లేదని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. మొండి వైఖరి ఆపాలి..…
సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో అన్ని సమస్యల పరిష్కారాలపై చర్చించినట్లు తెలిపింది. మంత్రి హామీతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు, మంత్రి హామీతో సమ్మె తాత్కాలికంగా విరమించుకున్నట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. హామీలు నెరవేర్చకపోతే భవిష్యత్ లో సమ్మె తప్పదని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి దశల వారీగా పరిష్కారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నిన్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా రేవంత్ ఇట్టి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న, నేడు నిరుద్యోగ నిరసనకు పిలుపు నివ్వడంతో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు.
హైదరాబాద్ లోని ఉస్మానియా కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిర్యుద్యోగ మార్చ్‌కు జేఏసీ పిలుపు మేరకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు.
కర్నూలులో రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. అయితే ఈ సభలో… అమరావతి రైతులకు మద్దతు తెలిపిన రాయలసీమ నేతల ఇళ్లకు గాజులు, చీరలు పంపుతాం అని జేఏసీ పేర్కొంది. రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తాం. అలాగే మూడు రాజధానుల బిల్లు తిరిగి ప్రవేశపెట్టకుంటే సీఎం జగన్ ఇల్లు కూడా ముట్టడిస్తాం అని జేఏసీ హెచ్చరించింది.…