బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులందరికి నవ్వులు పంచుతున్న కామెడీ షో జబర్దస్త్.. బుధవారం, గురువారం జబర్దస్త్ చూడకుండా పడుకునేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. కమెడియన్ గా, యాంకర్ గా మల్లెమాల సంస్థ లో నాటుకుపోయిన సుధీర్ ప్రస్తుతం ఆ సంస్థను వీడనున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. జబర్దస్త్ షో నుంచి…
బుల్లితెర కామెడీ షో ‘జబర్దస్త్’తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఫేమ్ సంపాదించుకున్నారు చాలా మంది ఆర్టిస్టులు. ఎంతో మందికి మంచి గుర్తింపును తీసుకువచ్చిన ఈ షో ద్వారా పాపులర్ అయిన ఆర్టిస్టుల్లో హైపర్ ఆది కూడా ఒకరు. షోతో పాటు హైపర్ ఆది క్రేజ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఆయన వేసే పంచులు, కామెడీ టైమింగ్ తెలుగు బుల్లితెర ప్రియులకు బాగా నచ్చుతాయి. ప్రస్తుతం ఆది “ధమాకా” అనే సినిమాతో పాటు పలు టీవీ కార్యక్రమాలతో బిజీగా…
అనసూయ భరద్వాజ్. ఈ పేరు చెబితే చాలు కుర్రకారు జబర్దస్త్ విందు చేసుకుంటారు. షో ప్రారంభమై ఎన్నేళ్ళయినా ఖతర్నాక్ డ్యాన్స్ లతో ఆమె బుల్లితెర ప్రేక్షకుల్ని కనువిందు చేస్తుంటుంది. స్కిట్ స్కిట్ల మధ్యలో అనసూయ చేసే డ్యాన్స్ లు కుర్రకారుని మతి పోగొడుతుంటాయి. బుల్లితెర కాదు వెండితెర పై కూడా అనసూయ అలరిస్తూనే వుంది. వరుస షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి…
కమెడియన్ ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోతో పేరు సంపాదించుకుని గత ఏడాది బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ఇటీవల అనూజ అనే అమ్మాయితో అతడి ఎంగేజ్‌మెంట్ జరగ్గా.. తాజాగా బుధవారం నాడు వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అనూజ మెడలో తాళి కడుతున్న ఫోటోలను కమెడియన్ రాంప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. ముక్కు అవినాష్…
ట్వీట్టర్ వేదికగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై అనసూయ పరోక్షంగా స్పందించింది. తన వేషధారణ గురించి కొందరూ కామెంట్ చేస్తున్నారని, సినిమాల్లో ఇంతకన్నా దారుణంగా ఉన్న వారి వస్త్రధారణ గురించి మాట్లాడకుండా తననే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. ఎంతో అనుభవమున్న వ్యక్తి ఇలా నీచంగా తనను కించపరుస్తూ మాట్లాడటం సబబు కాదన్నారు. అంతటి అనుభవమున్న వ్యక్తి మహిళలను కించపరుస్తూ, తాగుతూ నటించిన సోషల్ మీడియా, ప్రజలు పట్టించుకోకపోవటం దారుణమని ట్విట్టర్ వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేస్తూ షాకింగ్…
యూట్యూబ్ యాంకర్ శ్రవంతికి మల్లెమాలలో అద్భుతమైన అవకాశం వచ్చింది. “బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్” కోసం ఎంపికైనట్టు ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొంతకాలం నుంచి “శ్రీదేవి డ్రామా కంపెనీ” అనే షోలో ఇమ్మానుయేల్ కు జంటగా చేరి కామెడీ పండిస్తున్న శ్రవంతికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ అందరినీ తనవైపుకు అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రవంతి తనకు ఈ ఆఫర్…