బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా కామెడీ పండిస్తూ తెలుగు ప్రేక్షకులందరికి నవ్వులు పంచుతున్న కామెడీ షో జబర్దస్త్.. బుధవారం, గురువారం జబర్దస్త్ చూడకుండా పడుకునేవారు కాదు అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. కమెడియన్ గా, యాంకర్ గా మల్లెమాల సంస్థ లో నాటుకుపోయిన సుధీర్ ప్రస్తుతం ఆ సంస్థను వీడనున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి.
జబర్దస్త్ షో నుంచి సుధీర్ బయటికి విబచ్చినట్లు తెలుస్తోంది. సినిమాల్లో మంచి ఆఫర్లు రావడంతో డేట్స్ కాలిగా లేకపోవడంతో ఈ షో నుంచి వైదొలగాలని సుధీర్ నిర్ణయించుకున్నాడట.. ఇటీవల జబర్దస్త్ అగ్రిమెంట్ లో కూడా అతను సంతకం పెట్టలేదని తెలుస్తోంది. ఇత్తడితో పాటు స్నేహితులైన గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కమెడియన్స్ ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోతే కార్యక్రమం రేటింగ్ అమాంతం పడిపోతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ విషయమై సుధీర్ స్పందించాల్సిందే.