రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూమిని కేటాయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై యాజమాన్యాన్ని దక్కించుకుంది. ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా…
CtrlS AI Data Center: తెలంగాణలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు కంట్రోల్ఎస్ (CtrlS) డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ ప్రాజెక్టుకు కంట్రోల్ఎస్ సంస్థ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను తెలంగాణలో నెలకొల్పే ప్రణాళికను రూపొందించింది.…