GSLV-F12: ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది.. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో GSLV F-12 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ సవ్యంగా కొనసాగుతోంది.. నిన్న ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ.. 27 గంటల 30 నిముషాల పాటు కొనసాగిన తర్వాత.. రాకెట్ ను ప్రయోగించనుంది ఇస్రో.. ఈ ప్రయోగం ద్వారా దేశీయ నేవిగేషన్ అవసరాల కోసం IRNSS నావిక్ -1ఉప గ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు శాస్రవేత్తలు.. ఈ రోజు ఉదయం 10.42 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్థానిక సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ–ఎఫ్12)ను ప్రయోగించనున్నారు..
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఆదివారం ఉదయం 7.12 గంటలకు కౌంట్‌డౌన్‌ను శాస్త్రవేత్తలు ప్రారంభించగా.. మొత్తం 27.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–12 రాకెట్ ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన నావిక్–01 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగ పనులను ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం నావిగేషన్ శాటిలైట్ సిస్టం బలోపేతం కోసం చేస్తున్నారు.. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్–01 పేరుతో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. నావిక్–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్–5, ఎస్–బాండ్‌ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిన్న ఉదయం 7.42 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు.. కౌంట్‌డౌన్ తరువాత జీఎస్‌ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.. 19 నిమిషాల్లో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనుంది.