PSLV-C62: పీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలమైంది.. అంతరిక్షంలో ఏం జరిగింది?
- PSLV-C62 ప్రయోగం విఫలం..
- మూడో దశలో సాంకేతికత లోపం..
- నిర్దేశిత కక్ష్య నుంచి బయటకు..
- చాంబర్ ప్రెజర్ తగ్గడమే కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSLV-C62: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2026 స్పేస్ క్యాలెండర్లో తొలి ప్రయోగం విఫలమైంది. ఈరోజు (జనవరి 12) చేపట్టిన PSLV-C62 రాకెట్‌లో “EOS-N1” ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన 15 ఇతర ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే, ప్రయోగించిన కొద్దిసేపటికే రాకెట్‌కు నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు వెళ్లింది. మూడో దశలో ఆటంకం ఏర్పడినట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రకటించారు. ప్రారంభంలో రాకెట్ అనుకున్న విధంగా ప్రయాణించినప్పటికీ, ‘‘చాంబర్ ప్రెజర్ ఊహించని విధంగా తగ్గడం మూడో దశ (PS3) అవసరమైన థ్రస్ట్‌ను అందించడంలో విఫలమైంది. రాకెట్ నిర్దేశిత మార్గం నుంచి పక్కకు వెళ్లింది. దీంతో శాటిలైట్లను కక్ష్యలో ఉంచలేకపోయాము’’ అని చెప్పారు.
Read Also: Supreme Court: రూ.2,742 కోట్ల స్కామ్‌పై దాడులు.. మమతపై సుప్రీంకోర్టులో ఈడీ ఆరోపణలు
Also Read
ప్రధాన శాటిలైట్ అయిన డీఆర్డీవోకు చెందిన వ్యూహాత్మక నిఘా శాటిలైట్ అన్వేషాతో పాటు మరో 15 శాటిలైట్స్ అంతరిక్షంలో గల్లంతయ్యాయి. పీఎస్ఎల్వీ మూడో దశలో విఫలం కావడం ఇది వరసగా రెండోసారి. మొదటి రెండు దశలు బాగానే ఉన్నా, మూడో దశలో రాకెట్ గతి తప్పింది. రాకెట్ ఊహించని విధంగా నిర్దేశిత మార్గం నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది. సమతుల్యత కోల్పోయి బొంగరంలా తన చుట్టూ తాను తిరగడం ప్రారంభించింది. అంతరిక్షంలో గంటకు 8000 కిలోమీటర్ల వేగంతో చిన్నపాటి కదుపు కూడా మిషన్ పూర్తిగా నాశనం అయ్యేలా చేస్తుంది. ప్రాథమిక డేటా ప్రకారం, చాంబర్ ప్రెజర్ తగ్గినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇలాగే మే 2025లో PSLV-C61 మిషన్ విఫలమైంది. తగినంత పీడనం లేకపోవడంతో, కక్ష్యలోకి చేరుకునే వేగాన్ని రాకెట్ అందుకోలేకపోయింది.
पीएसएलवी-सी62 ने एक बार फिर भारत की तकनीकी क्षमता और साहस को दिखाया।
अंतरिक्ष में हर प्रयास सीख है, हर चुनौती भविष्य की सफलता की नींव।
इसरो का हौसला ही देश का असली गर्व है। 🇮🇳#PSLVC62 #ISRO pic.twitter.com/MoAhKnZH30
— Dwarka Daiya (@daiya_dwarka) January 12, 2026
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు