UN peacekeeping force: ఇజ్రాయిల్, సిరియా సరిహద్దుల్లోని గోలన్ హైట్స్‌లో ఐక్యరాజ్యసమితి డిసెంగేజ్‌మెంట్ అబ్జర్వర్ ఫోర్స్(యుఎన్డిఓఎఫ్) డిప్యూటీ ఫోర్స్ కమాండర్ (డిఎఫ్‌సి)గా పనిచేస్తున్న బ్రిగేడియర్ అమితాబ్ ఝా మరణించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆయన మరణించే సమయంలో మిషన్ యాక్టింగ్ ఫోర్స్ కమాండర్‌గా కూడా ఉన్నారు.
Israel: హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను జులైలో హత్య చేసింది తామేనని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. టెల్అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని తెలిపారు.
పశ్చిమాసియాలో సెప్టెంబర్ 17న ఊహించని విపత్తు తీవ్ర కలకలం రేపింది. హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో హఠాత్తుగా హిజ్బుల్లా చేతుల్లో ఉన్న పేజర్లు పేలిపోయాయి.
హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై క్షిపణులతో దాడి చేసింది. అయితే, దీనికి అమెరికా ప్రతీకార దాడులకు దిగింది. యెమెన్ రాజధానిలో ఉన్న హౌతీల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది.
నేడు హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై క్షిపణితో దాడి చేశారు. అయితే, ఆ క్షిపణిని అడ్డుకోవడంలో తాము ఫెయిల్ కావడంతో 14 మందికి తీవ్ర గాయాలైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది.
పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ వినూత్న శైలితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పాలస్తీనా అనే పేరును ముద్రించిన బ్యాగ్‌ను తగిలించుకుని హల్చల్ చేశారు.
పశ్చిమాసియాలో ఇంకా యుద్ధం కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జరిగిన దాడిలో 69 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
సిరియా అధ్యక్షుడు అసద్ భవిష్యత్‌ను ముందే ఊహించినట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. తాజాగా అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పాలస్తీనా పౌరులు భయంతో గడుపుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 69 మంది పౌరులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. గాయపడినవారిలో జర్నలిస్టులు, పాలస్తీనా సివిల్ డిఫెన్స్‌కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. మరోవైపు సిరియాలో సోమవారం…
సిరియాపై ఇజ్రాయెల్ యుద్ధం సాగిస్తోంది. సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటుదారులు సిరియాను స్వాధీనం చేసుకున్నారు. అసద్ పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్నారు.