ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ రాజకీయ నేత సలాహ్ అల్-బర్దవీల్ మరణించాడు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ రాజకీయ నాయకుడు సలాహ్ అల్-బర్దవీల్ మరణించారని హమాస్ అధికారులు తెలిపారు. తనపై దాడి జరిగినప్పుడు బర్దవీల్ తన భార్యతో కలిసి ప్రార్థనలు చేస్తున్నాడని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పదే పదే ఈ యుద్ధం ప్రధాన లక్ష్యం హమాస్‌ను సైనిక, పాలక సంస్థగా నాశనం చేయడమే అని చెప్పారు.
Also Read:America: కసాయి తల్లి.. కొడుకు గొంతు కోసి చంపిన భారత సంతతికి చెందిన మహిళ
మిగిలిన బందీలను విడుదల చేయమని ఆ బృందాన్ని బలవంతం చేయడమే కొత్త ఆపరేషన్ లక్ష్యమని ఆయన అన్నారు. గాజా ప్రజలకు ఇది చివరి హెచ్చరిక అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ అన్నారు. అమెరికా అధ్యక్షుడి సలహాను పాటించండి. బందీలను తిరిగి ఇవ్వండి.. హమాస్‌ను నిర్మూలించండి అని హెచ్చరించారు. గాజా స్ట్రిప్ చుట్టూ ఉన్న ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై హమాస్ విధ్వంసకర దాడి తర్వాత, ఇజ్రాయెల్ అక్టోబర్ 7, 2023న గాజాలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ లెక్క ప్రకారం దాదాపు 1,200 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు.