హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు సాగిస్తోంది. గత సోమవారం నుంచి దాడులను ఉధృతం చేసింది. 400 మందికిపైగా చనిపోయినట్లుగా హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామా తబాష్ హతమయ్యాడు. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఒసామా ఎలిమినేట్ అంటూ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడిలో గురువారం హతమైనట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Karnataka: సిద్ధరామయ్య సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలలో లైంగిక విద్య ప్రవేశపెట్టాలని నిర్ణయం
హమాస్‌ను ఒసామా తబాష్ ముందుండి నడిపిస్తున్నట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది. హమాస్‌కు పోరాట వ్యూహాలను రచించడంలో ఒసామా కీలక పాత్ర పోషిస్తున్నాడు. దక్షిణ గాజాలో సైనిక నిఘా అధిపతిగా ఉన్నాడు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడికి పురికొల్పిన వ్యక్తుల్లో ఒసామా పాత్ర కీలకమైంది. చొరబాట్లను ప్లాన్ చేయడం.. లక్ష్యాలను ఛేదించేలా వ్యూహాలు రచించడంలో ఒసామా కీలక పాత్ర ఉంది. నిఘా కార్యకలాపాలన్నీ ఇతడే చూసుకుంటున్నాడు. సంవత్సరాలు తరబడి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఇజ్రాయెల్‌పై ఉసికొల్పింది ఒసామానే అని ఐడీఎఫ్ నిర్ధారించింది.
🔴 ELIMINATED: Head of Hamas' Military Intelligence in Southern Gaza and Head of Hamas' Surveillance And Targeting Unit, Osama Tabash.
Tabash held various senior positions in Hamas, including a battalion commander in the Khan Yunis Brigade.
Tabash was also responsible for… pic.twitter.com/fXbwkIq4K8
— Israel Defense Forces (@IDF) March 21, 2025