Netanyahu: ఇజ్రాయిల్ గాజాపై దాడి చేయడాన్ని పలు ముస్లిం, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగ సమయంలో అరబ్ దేశాలు, ముస్లిం దేశాల ప్రతినిధులు సభను నుంచి వాకౌట్ చేశారు. కొన్ని దేశాలు మాత్రమే సభలో కూర్చుని నెతన్యాహూ ప్రసంగాన్ని విన్నాయి.
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ దారుణానికి ఒడిగట్టింది. ఇజ్రాయిల్ సైనికులకు సహకరించారనే నెపంతో ముగ్గురు పాలస్తీనా పౌరుల్ని బహిరంగంగా ఉరి తీశారు. ఇజ్రాయిల్‌కి సహకరించినందుకు వెస్ట్‌బ్యాంక్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. తుల్కర్మ్‌లో రెండు మృతదేహాలను విద్యుత్ స్తంభానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Israel Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం చాలా కాలం కొనసాగవచ్చు. అక్టోబర్ 7న మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుద్ధంలో హమాస్‌ను పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది.
రాకెట్ల దాడితో ప్రతీకారం తీర్చుకున్న పాలస్తీనా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబు దాడులను విస్తరించడంతో గాజాలో వాతావరణం హింసాత్మకంగా మారింది. పాలస్తీనా ఉద్యమం ఇస్లామిక్ జిహాద్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ బ్రేకింగ్ డాన్ కింద గాజా స్ట్రిప్‌ను లక్ష్యంగా చేసుకున్న వైమానిక దాడుల కారణంగా 24 మంది మరణించగా.. మరో 203 మంది గాయపడ్డారు.