అనుకున్నట్టే అయింది.. పశ్చిమాసియా భగ్గుమంటోంది. తమ శత్రుమూకలను వేటాడి వెంటాడి మట్టుపెడుతున్న ఇజ్రాయెల్ పై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్.. ఇరాన్ ను హెచ్చరించింది. అదే జరిగితే మరింతగా విరుచుకుపడతాం అని ఇరాన్ బదులిచ్చింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుంది. దీంతో యుద్ధం వచ్చేసిందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తీవ్రవాద సంస్థలకు మద్దతుగా…