Israel-Hamas war: ఇజ్రాయెల్ దేశంపై ఇరాన్, హిజ్బుల్లాలు ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని అగ్ర దేశం అమెరికా అంచనా వేసింది. దీనిపై జీ- 7 దేశాలకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సమాచారాన్ని అందించినట్లు టాక్.
Israel: ఇజ్రాయిల్ వరసగా తన శత్రువల్ని ఒక్కొక్కరిగా మట్టుపెడుతోంది. ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో అత్యంత భద్రతలో ఉన్న హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. తామే చేశామని చెప్పుకోకున్నా, ఇరాన్‌తో పాటు హమాస్ ఇది ఇజ్రాయిల్ పనే అని ఆరోపిస్తున్నాయి.
Israel: ఇజ్రాయిల్ శత్రువులుగా భావిస్తున్న ఇద్దరు కేవలం 12 గంటల వ్యవధిలోనే హతమార్చబడ్డారు. టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. దీనికి కొన్ని గంటల ముందు లెబనాన్ నుంచి పనిచేస్తున్న హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ బీరూట్‌లో చంపబడ్డాడు.
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. శనివారం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.
Israel Yemen War : టెల్ అవీవ్ నగరంపై హౌతీ తిరుగుబాటుదారులు చేసిన డ్రోన్ దాడికి ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంది. ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్ పశ్చిమ యెమెన్‌లోని అనేక తిరుగుబాటు గ్రూపు లక్ష్యాలపై దాడి చేసింది.
Israel: ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా శనివారం గాజాలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 71 మంది మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ పోరు రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నేలకూల్చే వరకు ఇజ్రాయిల్ విశ్రమించేలా కనిపించడం లేదు.
Israel-Hamas War: ఇజ్రాయెల్ మంగళవారం దక్షిణ గాజాలోని పాలస్తీనా భూభాగంలోని పాఠశాలపై దాడి చేసి సుమారు 19 మందిని హతమార్చింది. అదే సమయంలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం నేటికీ కొనసాగుతోంది. ఈ యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. గాజాలో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో హమాస్ యూఎస్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని అమలు చేసేందుకు అంగీకరించిందని శనివారం వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.