Israel-Hamas War : ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం ఈజిప్ట్, గాజా మధ్య రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు రఫాపై భూదాడి చేస్తామని హెచ్చరించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ట్యాంకులు రఫా సరిహద్దుకు చేరుకున్నాయి. అదే సమయంలో, రఫా సరిహద్దును ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడానికి కొంతకాలం ముందు, హమాస్ కతార్ మధ్యవర్తిత్వం వహించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించింది. అంతేకాకుండా, 33 మంది బందీలను విడుదల చేయడానికి కూడా అంగీకరించింది.
హమాస్ చెర నుండి విడుదలైన ప్రతి బందీకి, ఇజ్రాయెల్ 60 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తుందని కాల్పుల విరమణ నిబంధనలు పేర్కొంటున్నాయి, ఇందులో మహిళలు, పిల్లలు, 50 ఏళ్లు పైబడిన వృద్ధులు ఉంటారు. అయితే ఖతార్, ఈజిప్ట్, అమెరికా అధికారులు రూపొందించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ తిరస్కరించింది. మరోవైపు, హమాస్ ప్రత్యర్థి పాలస్తీనా అథారిటీ ప్రతినిధి, సంఘర్షణ తీవ్రతరం కాకుండా ఆపడానికి యుఎస్ మరియు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also:Janhvi Kapoor : ఆ రూమర్ పై స్పందించిన దేవర బ్యూటీ..
సోమవారం, మంగళవారం మధ్య దక్షిణ గాజా, రఫాలో నిర్వహించిన ఆపరేషన్లలో 20 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం రఫాలోని అల్ అబ్రార్ మసీదుపై కూడా దాడి చేసింది. అక్కడ చాలా మంది హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నట్లు ఖచ్చితమైన సమాచారం అందింది.
కాల్పుల విరమణ ప్రతిపాదనలో డిమాండ్లు అంగీకరించలేదు: నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ తాజా కాల్పుల విరమణ ప్రతిపాదన ఇజ్రాయెల్ ముఖ్యమైన డిమాండ్లను పరిగణించడం లేదు. బందీలను తిరిగి ఇచ్చేయాలని గాజాపై చాలా సైనిక ఒత్తిడి ఉందని ఆయన అన్నారు. బందీలను విడిపించేందుకు చర్చలు విఫలమైతే, రఫాపై బలమైన సైనిక దాడి చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు.
Read Also:Parth Jindal Angry: కోపంతో ఊగిపోయిన ఢిల్లీ ఓనర్ పార్త్ జిందాల్.. వీడియో వైరల్!