Russia: ఈ వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాను సందర్శించాడు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షులు కీలక విషయాలను చర్చిన్చుకున్నట్లు గురువారం రష్యా వెల్లడించింది. చైనాతో మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికాలో తన విధానాన్ని సమన్వయం చేస్తున్నట్లు రష్యా గురువారం తెలిపింది. కాగా రష్యా ఉప విదేశాంగ మంత్రి మిఖాయిల్ బొగ్డనోవ్ మధ్యప్రాచ్యంలో చైనా ప్రత్యేక రాయబారి జై జున్‌తో దోహాలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ మరియు గాజా స్ట్రిప్‌ను నడుపుతున్న…
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడికి తెగబడ్డారు. గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి ప్రవేశంచి చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా అత్యంత పాశవికంగా హత్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. చిన్నారుల తలలను నరికేశారు. ఈ దాడుల్లో 1400 మంది సామాన్య ప్రజలు మరణించారు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.
Imran Khan: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూదులకు సన్నిహితుడు కావడం వల్లే ఇమ్రాన్ ఖాన్‌పై ఇస్లామిక్ తీవ్రవాదులు హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో సాధారణ ప్రజలు మరణిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడులు చేశారు. ఈ దాడుల్లో 1400 మంది చనిపోయారు. మరోవైపు ప్రతీకారేచ్ఛతో రగులుతున్న ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై హమాస్ ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 4000 మంది ప్రజలు చనిపోయారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ యుద్ధంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో విమర్శించారు. పాలస్తీనాపై భారత్ అవలంభిస్తున్న వైఖరి తీవ్రంగా నిరాశపరించిందని అన్నారు. అమాయకులు, నిస్సహాయులైన మహిళలు, పిల్లలు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నప్పుడు బలమైన వైఖరి లేకుండా భారతదేశం ఎలా నిలబడగలదు..? ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారత ప్రభుత్వం వైఖరి తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు.
Joe Biden: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్‌కి అమెరికా మద్దతు తెలియజేసేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ రోజు ఆ దేశానికి వెళ్లారు. ఇజ్రాయిల్ పై హమాస్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇరువురు నాయకుడు కొనసాగుతున్న యుద్ధం గురించి చర్చించారు. హమాస్ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా క్రూరంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ పై జరిగిన దాడుల్లో 1400 మంది చనిపోయారు. పిల్లలు, మహిళలు అనే తేడా లేకుండా దొరికినవాళ్లను దొరికినట్లు కాల్చి చంపారు. 200 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. ఇది ఉంటే ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ పై భీకరదాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో 3000 మంది మరణించారు.
Benjamin Netanyahu:ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ సందర్శించారు. ఇజ్రాయిల్ పీఎం బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశమయ్యారు. ఇజ్రాయిల్ కి మద్దతు తెలిపేందుకే, అమెరికా ఇజ్రాయిల్‌కి వెన్నుదన్నుగా నిలిచేందుకే ఇక్కడికి వచ్చానని తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు ఐసిస్ కన్నా దారుణంగా ఉన్నారని బైడెన్ అన్నారు.
Israel: గాజాలో అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఏకంగా 500 మంది మరణించడంపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈ దాడి ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కొత్త టర్న్ తీసుకుంది. ఈ దాడికి మీరంటే మీరే కారణమని ఇజ్రాయిల్, హమాస్ ఒకరినొకరిని నిందించుకుంటున్నాయి.
ఈ సంక్షోభ సమయంలో పాలస్తీనా ప్రజల కోసం సాయం చేసే మూడు స్వచ్ఛంద సంస్థలకు తాను రూ. 2.5 కోట్లు విరాళంగా ఇస్తానని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తక్షణ కాల్పుల విరమణకు, శాశ్వత శాంతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.