Israel: అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాన్ మిలిటెంట్ సంస్థ క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. అయితే అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక బలగాలు నిప్పుల వర్షాన్ని కురపిస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని అనుమానం వచ్చినా కూడా ఆ భవనాలను నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇజ్రాయిల్ జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో 5000 మంది చనిపోయారు. వీరిలో సాధారణ పౌరులు, పిల్లలు కూడా…
Israel Hamas War: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసింది. విచక్షణారహితముగా ఇజ్రాయిల్ పైన విరుచుకుపడింది. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్దానికి కారణం అయ్యాయి. మొదట్లో ఇజ్రాయిల్ పైన హమాస్ పైచెయ్యి సాధించిన రానురాను ఇజ్రాయిల్ దాడికి హమాస్ వణికిపోతుంది. వివారాలలోకి వెళ్తే .. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో కేవలం గత 24 గంటల్లోనే దాదాపు 704 మంది పౌరులు మరణించారని వీరిలో 305 మంది…
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్దంతో గాజాలో తీవ్ర నష్టం జరిగింది. దీంతో గాజా స్ట్రిప్ లో ఆరోగ్య సామాగ్రి, ఇంధనం యొక్క సురక్షితమైన రవాణాను సులభతరం చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణ మానవతా కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది
ఇజ్రాయెల్ సైనికుల విమానాలు పాలస్తీనాలో కరపత్రాలు చల్లుతున్నారు. ఇజ్రాయెల్ పౌరులను హమాస్ గ్రూపు బంధించిన వివరాలను తమకు అందించాలని.. అలా ఇచ్చిన వారికి రివార్డులు ఇస్తామని ఆ కరపత్రాల్లో పేర్కొంది.
మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. మణిపూర్‌లో కుట్రపూరితంగానే ఈ ఘటన అంతా జరిగిందన్నారు. నాగ్‌పూర్‌లో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ప్రస్తావించారు.
పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయకుండా ఆపాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ప్రపంచం యుద్ధం, శాంతిని ఎంచుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.
Israel–Hamas war: అక్టోబర్ 7 వ తేదీన ఇజ్రాయిల్ పైన హమాస్ చేసిన ఆకస్మిక దాడితో మోగిన యుద్ధ బేరి నేటికీ వినపడుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికి ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన పౌరులు 5500 మందికి పైగా మరణించారు. గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇరాన్ హమాస్ కు మద్దతు ఇస్తుంది. ఇరాన్ హమాస్ కు…
Benjamin Netanyahu: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా ఈ యుద్ధంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు వస్తున్నాయి. హమాస్‌కి మద్దతుగా ఇప్పటికే ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంత సరిహద్దుపై లెబనాన్ నుంచి హిజ్బుల్లా దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయిల్ టూ ఫ్రంట్ వార్ చేస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేసింది.
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భయానక దాడికి పాల్పడ్డారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇజ్రాయిల్ లోని ప్రజలను ఊచకోత కోశారు. మొత్తం 1400 మంది వరకు ప్రజలు మరణించారు. ఇజ్రాయిల్ కనీవిని ఎరగని రీతిలో దాడి జరిగింది. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్ హమాస్ ఉగ్రవాద సంస్థను నేలమట్టం చేసేందుకు సిద్ధమైంది.
India's aid to Gaza: ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం నడుమ గాజాలోని సాధారణ పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ రాకెట్ ఎటునుంచి వస్తుందో అని, ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయపడుతున్నారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ ని దిగ్భంధించింది. ఉత్తర గాజాలోని ప్రజలను సురక్షితమైన దక్షిణ ప్రాంతాలకు వెళ్లాలని సూచించడంతో, ఆ ప్రాంతంలోని 10 లక్షల మందిలో 7 లక్షల మంది దక్షిణ వైపు వెళ్లారు.