Israel Hamas War: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసింది. విచక్షణారహితముగా ఇజ్రాయిల్ పైన విరుచుకుపడింది. ఈ దాడులు ఇరు దేశాల మధ్య యుద్దానికి కారణం అయ్యాయి. మొదట్లో ఇజ్రాయిల్ పైన హమాస్ పైచెయ్యి సాధించిన రానురాను ఇజ్రాయిల్ దాడికి హమాస్ వణికిపోతుంది. వివారాలలోకి వెళ్తే .. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో కేవలం గత 24 గంటల్లోనే దాదాపు 704 మంది పౌరులు మరణించారని వీరిలో 305 మంది చిన్నారులు కూడా ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే గాజా పైన ఇజ్రాయిల్ చేస్తున్న బాంబు దాడుల కారణంగా గాజాలో విద్యుత్తు కొరత ఏర్పడింది. దీనితో గాజా లోని చాల ఆసుపత్రులు మూతబడ్డాయి. దీనితో బాంబు దాడుల్లో గాయపడిన వారికి, రోగులకు వైద్యం అందడం కష్టతరంగా మారిందని హమాస్ ఆరోపించింది.
Read also:Pakisthan: పాక్ ను ఓడించిన ఆఫ్ఘనిస్తాన్.. బాబార్ ఆజాంపై వేటు..
అయితే హమాస్ కమాండర్లు, తీవ్రవాదులే లక్ష్యంగా గత 24 గంటల్లో 400 వైమానిక దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. కాగా ఇజ్రాయిల్ కు మద్దతునిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అయ్యారు. మరో వైపు ఇజ్రాయిల్ గాజా పైన చేస్తున్న దాడులు ఇజ్రాయిల్ కె బెడిసికొట్టే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హెచ్చరించారు. గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు పాలస్తీనియన్లలో ఆగ్రహాన్ని పెంచడమే కాకుండా ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ మద్దతునూ బలహీనపరుస్తాయని తెలిపారు. ప్రాణ నష్టాన్ని పట్టించుకోని ఇజ్రాయెల్ సైనిక వ్యూహాలు.. తిరిగి ఇజ్రాయిల్ కె బెడిసికొట్టే అవకాశం ఉందన్నారు. కాగా హమాస్ చెరలో తమ పౌరులు 222 మంది బందీలుగా ఉన్నట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది. అలానే సోమవారం హమాస్ ఇద్దరు ఇజ్రాయిల్ వృద్ధులను విడిచిపెట్టింది. అయితే హమాస్ మిలిటెంట్ల అధీనంలో బందీలుగా ఉన్న ఇజ్రాయిల్ పౌరుల ఆచూకీ చెప్పాలని ఇజ్రాయిల్ గాజా సైనికులకు ఆఫర్ ఇచ్చింది. చెప్పిన వాళ్ళ వివరాలు గోప్యతంగా ఉంచుతామని, రక్షణ కల్పిస్తామని, ప్రైజ్ మనీ కూడా ఇస్తామని మంగళవారం పేర్కొన్నది.