Israel–Hamas war: అక్టోబర్ 7 వ తేదీన ఇజ్రాయిల్ పైన హమాస్ చేసిన ఆకస్మిక దాడితో మోగిన యుద్ధ బేరి నేటికీ వినపడుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇప్పటికి ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన పౌరులు 5500 మందికి పైగా మరణించారు. గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇరాన్ హమాస్ కు మద్దతు ఇస్తుంది. ఇరాన్ హమాస్ కు మద్దతు ఇవ్వడం వల్ల ఇజ్రాయిల్ హమాస్ మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read also:Chennai: చెన్నై ఆవడి వద్ద పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్..
ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం సాగుతున్న ఈ సమయంలో పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే విద్ధంగా ఇరాన్ తన స్వలాభం కోసం హమాస్ మరియు హిజ్బుల్లాలకు మద్దతునిస్తూనే ఉంది. ఇది ఇరాన్ స్వార్ధ బుద్దిని తెలియ చేస్తుందనిఆరోపించారు. మేము ప్రతిదీ గమనిస్తూనే ఉన్నామని ఇరాన్ హమాస్ కు మద్దతు ఇస్తూ హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అయితే బాధ్యత గల మాదేశం ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించదు. అలానే హమాస్ ఉగ్రవాదులను సమర్ధించి వాళ్ళకి మద్దతుగా నిలవదు. ఈ విషయం గతంలో కూడ తెలియ చేసాము. దీనితో ఇరాన్ మధ్యప్రాచ్యంలోని యుఎస్ లక్ష్యాలపై ఇరాన్ దాడులను చురుకుగా ప్రోత్సహిస్తోందని.. దీనికి కారణం హమాస్ ఇజ్రాయిల్ మధ్యన యుద్ధం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేయడమేనని వైట్ హౌస్ సోమవారం ఆరోపించింది.