గాజా స్వాధీనమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ను అంతం చేసి బందీలను విడిపించడమే తమ టార్గెట్ అని ఇజ్రాయెల్ అంటోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక తీర్మానం చేసింది. గాజా కాల్పుల విరమణపై యూఎన్ తీర్మానం చేసింది. దీన్ని అమెరికా తిరస్కరించింది.
గాజాలో బందీలను విడుదల చేసే ఒప్పందానికి పాలస్తీనా ఉగ్రవాద సంస్థ అంగీకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం హమాస్‌కు ‘తుది హెచ్చరిక’ జారీ చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో “ఇజ్రాయెల్ నా షరతులను అంగీకరించింది. ఇప్పుడు హమాస్ కూడా అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది” అని రాసుకొచ్చారు. ‘ షరతులను అంగీకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నేను హమాస్‌ను హెచ్చరించాను. ఇది నా చివరి హెచ్చరిక, ఇక మరో అవకాశం ఉండదు!’…
Israel Gaza War: ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇజ్రాయెల్ శక్తిసామర్థ్యాలపైన కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక అవగాహన ఉంది. తాజాగా ఇజ్రాయెల్ స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్లాన్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం మొదలై దాదాపు 22 నెలలవుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు గాజాలో దాదాపు 61 వేలమందికి పైగా మృతి చెందారు. మరోవైపు హమాస్ చెరలో…
Hamas: గతేడాది గాజాలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చింది. ఆ సమయంలో యాహ్యా సిన్వార్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గాజాలోని టన్నెల్స్‌లో అత్యంత రహస్యంగా ఉండే సిన్వార్‌ని ఇజ్రాయిల్ బలగాలు ఎంతో ట్రాక్ చేసి, చివరకు హతమార్చింది. ఇదిలా ఉంటే, ఆయన భార్య గాజా నుంచి తప్పించుకుని, టర్కీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
Israel: అక్టోబర్ 07 నాటి హమాస్ దాడులకు ఏడాది అవుతున్న తరుణంలో ఇజ్రాయిల్ అప్రమత్తమైంది. అయితే, ఆదివారం రోజు దక్షిణ ఇజ్రాయిల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పల్లో ఒకరు మరణించగా, 10 మంది గాయపడినట్లు ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు. దక్షిణ ఇజ్రాయిల్‌లోని బీర్ షెవాలో ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి.
Israel-Gaza War: అక్టోబర్ 07 నాటి దాడులకు రేపటితో ఏడాది పూర్తి అవుతున్న వేళ హమాస్ మరోసారి తన దురుద్దేశాన్ని ప్రకటించింది. గాజా నుంచి ఇజ్రాయిల్‌పైకి రాకెట్లను ప్రయోగించింది. ముఖ్యంగా దక్షిణ ఇజ్రాయిల్ ప్రాంతంపై రాకెట్లు ప్రవేశించాయి.
Israel Gaza War : దక్షిణ గాజా స్ట్రిప్‌లో అనేక ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 36 మంది పాలస్తీనియన్లు మరణించారు. శనివారం ఉదయం ఖాన్ యూనిస్ నగరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన
Israel–Hamas war: గాజాలో ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై దాడులు జరిపాయి ఇజ్రాయెల్ సేనలు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
Israel Gaza War : ఎనిమిది నెలలుగా హమాస్‌తో కొనసాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం ఆదివారం మరో రూపం సంతరించుకుంది. సెంట్రల్ గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 27 మంది మరణించారు.
Israel Attack : గాజా, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఆగడం లేదు. ఇప్పుడు దక్షిణ గాజాలోని రఫా నగరం రణరంగంగా మారిపోయింది. గాజాలో దాడుల తరువాత, పాలస్తీనియన్లు దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఆశ్రయం పొందారు.