ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో కొత్త మలుపు తిరిగింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ తిరస్కరించింది. అదే సమయంలో, హమాస్ కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను సమర్పించింది. ఇందులో ఇజ్రాయెల్ బందీల విడుదలకు షరతులు విధించారు.
Israeli Attack : రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనియన్లు మరణించారు. కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ... భూమి దాడికి ముందు దక్షిణ గాజా నగరం నుండి వేలాది మంది ప్రజలను తరలించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని సైన్యాన్ని కోరినట్లు చెప్పారు.
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజాలో విధ్వంసం నెలకొంది. ఇజ్రాయిల్ నిరంతర దాడుల కారణంగా గాజా శ్మశాన వాటికగా మారుతోంది. అనేక నగరాల పేర్లు, జాడలు చెరిగిపోయాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా స్ట్రిప్‌లోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని పాలస్తీనా ఆరోపించింది.
IMF: ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రపంచం రెండుగా చీలి ఇరు వైపుల పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.ఇదిలా ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధం ఎలా ప్రభావితం చేస్తుందో అని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న వేళ ఇప్పుడు ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్య ప్రపంచం ముందు నిలిచింది.