Elgar Parishad Case: ఎల్గార్ పరిషత్, మావోయిస్టు సంబంధాల కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లాఖాకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తెలిపింది. అతని బెయిల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టుకు తెలిపింది. నవ్లాఖా జాతీయ భద్రత, ఐక్యత, సార్వభౌమాధికారంపై ప్రభావం చూపేలా పలు చర్యలకు పాల్పడ్డారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. నవ్‌లాఖా బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్ఐఏ న్యాయవాది సందేశ్…
Pakistan planned terror attacks in Hyderabad: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత్ లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలతో ఉగ్రదాడికి పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ హెచ్చరించింది.
దేశ రాజధాని ఢిల్లీలో గుర్తించిన మృతదేహం వెనుక ఉగ్రకోణం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులను విచారిస్తున్న కొద్దీ దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Pakistan's New Army Chief Is Lieutenant General Asim Munir: దాయాది దేశం పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను గురువారం నియమించింది పాక్ రక్షణ మంత్రిత్వ శాఖ. ఈ నెలఖారులో ప్రస్తుతం సైన్యాధ్యక్షుడు కమర్ జావేద్ బజ్వా పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ బాధ్యతలను తీసుకోనున్నారు. గత ఆరేళ్లుగా పాక్ సైన్యాధ్యక్షుడిగా బజ్వా అన్నారు. మునీర్ గతంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటర్…
Pakistan plan to launch terror attacks in India: భారత దేశంలో విధ్వంసం సృష్టించడానికి దయాది దేశం పాకిస్తాన్ కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం నాడు దాడులు చేయడానికి ప్రణాళికలు చేసిందని ఇన్ పుట్స్ ఉన్నాయి. దీనికి అంతా తానై పాక్ గూఢాచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో దేశంలో చాలా ఉగ్రదాడుల వెనక ఐఎస్ఐ హస్తం ఉంది.
Army jawan, honey-trapped by two Pakistani women agents: భారతదేశాన్ని దెబ్బతీసేందుకు దాయాది దేశం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తోంది. దొంగదారిన భారత రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆర్మీకి సంబంధించిన సున్నిత సమాచారాన్ని సేకరించడానికి పాకిస్తాన్ గూఢాచార ఏజెన్సీ‘ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్’(ఐఎస్ఐ) తన ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఐఎస్ఐ వలపు వలకు భారత ఆర్మీకి చెందిన ఓ సైనికుడు చిక్కాడు. ఐఎస్ఐకి చెందిన ఇద్దరు మహిళా ఏజెంట్ల హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. ఈ…
డ్రగ్స్, మాఫియా, సెలబ్రిటీ హత్య…వరుస వివాదాలు ఏం చెప్తున్నాయి?ఆప్ ప్రభుత్వం ముందు అన్నీ సవాళ్లేనా?పంజాబ్ మళ్లీ ఖలిస్తాన్ గా మారబోతోందా?తీవ్రవాదం, మాఫియాతో రగిలిపోనుందా? పంజాబ్‌లో ఏం జరుగుతోంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది.ఆ రాష్ట్రలో ఏం జరుగుతోంది?ఏం జరగబోతోందనే ఆందోళన పెరుగుతోంది.నిజానికి అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వివాదాలు మాత్రం కామన్. డ్రగ్స్ మాఫియా, ఇటీవల రైతు ఉద్యమాలు, ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ హత్య..ఇలా నిత్యం ఏదో వివాదంలో నిలుస్తోంది.ఇప్పుడు ఖలిస్తాన్ నినాదం మళ్లీ…
పంజాబ్ లో అసలేం జరుగుతోంది. గతేడాది గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రయత్నం చేసింది. రైతుల ముసుగులో తీవ్రవాదులను ఉసిగొల్పిందనే వాదన వినిపిస్తోంది. పంజాబ్ అంతటా తీవ్రవాదం పెంచేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తోంది. ఖలిస్తాన్ ఉద్యమం తోడయితే పంజాబ్, దానివల్ల దేశం ప్రమాదంలో పడనుంది.
కాబూల్ బ్లాస్ట్ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 150 దాటిందని తెలుస్తోంది. మరికొంత మంది ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇటు కాబూల్ ఎయిర్ పోర్టుకు ఉగ్రవాదుల నుంచి మరోసారి ముప్పు పొంచి ఉందని అమెరికా సహా అనేక దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఇటు బాంబు దాడుల భయం ఉన్నా జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎయిర్ పోర్టు గుంపులు గుంపులుగా తరలి వస్తూనే ఉన్నారు. ఇటు,…