పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఇటీవల హర్యానా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని పేజీలు పాకిస్థాన్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని, అక్కడి పర్యటన అనుభవాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు…
Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా జరిపిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో దాదాపుగా 80 మంది వరకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఈ రెండు ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న బహవల్పూర్, మురిడ్కేపై దాడులు నిర్వహించడం ఈ ఆపరేషన్‌కే హైలెట్‌గా మారింది. Read Also: Ponnam Prabhakar:…
Hafiz Saeed: భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్(LeT) చీఫ్, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కి పాకస్తాన్ భారీ ఎత్తున భద్రత కల్పిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది లష్కరే ప్రాక్సీ అయిన ‘‘ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రవాదులే. పహల్గామ్ దాడి తర్వాత భారత టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీస్ సయీద్ ఉన్నాడని తెలిసి పాకిస్తాన్ ప్రభుత్వం, ఐఎస్ఐ అతడికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు తెలుస్తోంది.
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు గురించి ఉగ్రవాది మాట్లాడిన వీడియోని ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కావాలని వైరల్ చేస్తోంది.
Tahawwur Rana: 26/11 ముంబై ఉగ్రదాడుల కీలక కుట్రదారు, ఉగ్రవాది అయిన పాక్-కెనెడియన్ తహవూర్ రాణాని భారత అధికారులు గురువారం అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. అమెరికా న్యాయస్థానాల్లో భారత్‌కి అప్పగించకుండా ఉండేందుకు అన్ని న్యాయ సదుపాయాలను రాణా ఉపయోగించుకున్నాడు.
Honeytrap: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఫ్యాక్టరీకి చెందిన సున్నిత వివరాలను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి లీక్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘హానీ ట్రాప్’’లో చిక్కుకున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లతో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆగ్రాకు చెందిన రవీంద్ర కుమార్‌తో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేసింది.
Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి తమ సత్తా చూపించారు. భారత వ్యతిరేక, పాక్ ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్నారు. అత్యంత పకడ్భందీగా ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఇప్పటి వరకు పాక్ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఆర్మీ వీరిని పట్టుకోలేకపోతోంది. అయితే, దీని వెనక భారత హస్తముందని పాక్ ఆరోపిస్తోంది.
Donald Trump: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నిధుల దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు 21 మిలియన్ డాలర్లను యూఎస్ఎయిడ్ ద్వారా అందించినట్లు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు.
Jammu Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా అఖ్నూర్‌లోని బట్టల్ ప్రాంతంలో ఆర్మీ అంబులెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.