Hafiz Saeed: భారత్‌కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నవంబర్ 2న లాహోర్‌లోని మినార్-ఎ-పాకిస్థాన్‌లో జరగాల్సిన లష్కరే తోయిబా ర్యాలీ అకస్మాత్తుగా రద్దు చేశారు. లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ర్యాలీ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇటీవల ఆయన ఈ ర్యాలీకి సంబంధించి జనాన్ని ఉద్దేశించి ఒక వీడియోను విడుదల చేశాడు. ఈక్రమంలో భారత నిఘా సంస్థలు లాహోర్ ర్యాలీని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇంతలో అకస్మాత్తుగా ఆ ర్యాలీని రద్దు చేయడం పాకిస్థాన్‌లో భయాందోళనలను సృష్టించింది. ఈ నిర్ణయం వెనక భయం లేక ఉగ్రవాదుల కొత్త కుట్ర ఏదైనా దాగి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
READ ALSO: Sudden Rains: ఏపీలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు..
హఫీజ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు..
పలు నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ర్యాలీ రద్దు నిర్ణయం వాస్తవానికి హఫీజ్ సయీద్దే అని సమాచారం. ఎందుకంటే ఆయన శిక్షణా శిబిరాలు, లాంచింగ్ ప్యాడ్‌లలోని ఉగ్రవాదులపై తన దృష్టిని కేంద్రీకరించాలనుకుంటున్నాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. హిమపాతం ప్రారంభానికి ముందు పెద్ద మొత్తంలో చొరబాటు ప్రయత్నాన్ని సులభతరం చేయడానికి దాయాది దేశం నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. చొరబాట్ల సంఖ్య సుమారు 120 నుంచి 150 వరకు ఉంటుందని అంచనా. హిమపాతం తర్వాత కాశ్మీర్‌లోకి అనేక చొరబాటు మార్గాలు మూసివేయబడతాయి. దీంతో ఈ టైంను చొరబాట్లకు కీలకమైనదిగా హఫీజ్ సయీద్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
పాకిస్థాన్ ISI, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఆదేశాల మేరకు దేశంలో కొన్ని ర్యాలీలు, కార్యక్రమాలు రద్దు చేశారు. పాకిస్థాన్‌లో మహిళలు ఆయుధాల నిర్వహణ, బాంబు తయారీ, పేలుడులో శిక్షణతో సహా ఆన్‌లైన్ జిహాద్ శిక్షణ పొందుతున్నారని నివేదికలు బయటికి వచ్చాయి. ఇప్పటికే ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అనేక శిక్షణా శిబిరాలను తరలించడం జరిగింది. లష్కరే తోయిబా కొత్త శిక్షణా కేంద్రం, మర్కజ్ జిహాద్-ఏ-అక్సా, ఆఫ్ఘన్ సరిహద్దు నుంచి దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దిగువ డెర్ జిల్లాలో నిర్మిస్తున్నారు. దీనిని నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని సమాచారం.
READ ALSO: Muslim Countries Alliance: ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టనున్న ముస్లిం దేశాల కొత్త కూటమి..?