'ఇష్క్'… అంటే 'ప్రేమ'! సినిమాపై 'ఇష్క్'తో చిత్రసీమలో అడుగుపెట్టే వారంతా ప్రేక్షకుల ప్రేమను పొందాలనే ఆశిస్తారు. అందం, చందం అన్నీ ఉన్నా, అభినయకౌశలం పుష్కలంగా ఉన్నా చిత్రసీమలో రాణించాలంటే కావలసింది ఆవగింజంత అదృష్టం అంటూ ఉంటారు. అందాల హీరోగా పేరు సంపాదించిన నితిన్ కెరీర్ తో అదృష్టం దోబూచులాడుతున్న సమయంలో అతనికి ఆనందం పంచే విజయాన్ని అందించిన చిత్రం 'ఇష్క్'. నితిన్ కెరీర్ ను 'ఇష్క్'కు ముందు, తరువాత అని విభజించవచ్చు. ఎందుకంటే ఆరంభంలోనే అదరహో అనే…