ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ టీం అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్లో అత్యధిక స్కోరు కూడా…
ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది. 287 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్…
టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మాంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషాన్ తనేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఇతర జట్లకి హెచ్చరికలు పంపాడు. అదే తరహాలో మొదటి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన…
ఈరోజు ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. రెండు జట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేతిలో ఉంది. హైదరాబాద్ పగ్గాలు పాట్ కమ్మిన్స్ చేతిలో ఉన్నాయి. రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి, ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి కుమారుడు నితేష్‌ల వివాహ రిసెప్షన్ ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ రిసెప్షన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అభినవ్ మనోహర్‌లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. ముంబై ప్లేయర్ ఇషాన్ కిషన్, పంజాబ్ ఆటగాడు అభిషేక్ శర్మలు నేరుగా వెళ్లి పెళ్లి కొడుకు…
SRH IPL 2025 Players List: ఐపీఎల్ 2025 కోసం నిర్వహించిన మెగా వేలం కోసం అన్ని జట్లు ఆటగాళ్ల కోసం భారీగా వేలం వేసి చాలా డబ్బు ఖర్చు చేశాయి. ప్రతి జట్టు 25 మంది ఆటగాళ్ల కోటాను పూర్తి చేయడానికి ప్రయత్నించింది. గత ఐపీఎల్ సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఐపీఎల్ వేలంలో భారీ కొనుగోళ్లు చేసి తన కొత్త జట్టును సిద్ధం చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజున…
Ishan Kishan Ball Tampering issue with umpire: భారత్ ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ మ్యాచ్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఫీల్డ్ అంపైర్ షాన్ క్రెయిగ్ భారత ఆటగాళ్లపై ఈ ఆరోపణ చేశాడు. మెక్‌కాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నాల్గవ రోజు, మ్యాచ్ బంతిని మార్చడం పట్ల ఇండియా ఎ జట్టు అసంతృప్తి తెలపగా, అంపైర్ షాన్ క్రెయిగ్‌తో చాలాసేపు వాదించినప్పుడు ఈ ఆరోపణ జరిగింది. ఈ చర్చ కారణంగా నాలుగో…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా గురువారం (అక్టోబర్ 31) విడుదలైంది. మెగా వేలానికి ముందు, మొత్తం 46 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీ జట్లు అంటిపెట్టుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి ఫ్రాంచైజీ జట్లు తమ మేటి ఆటగాళ్లను నిలబెట్టుకున్నాయి. కాగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వేలంలోకి అడుగుపెట్టనున్నాయి. Read…
తాను చాలా ప్రాక్టికల్ అని, జరిగిన ప్రతి సంఘటన గురించి బాధపడితే ఉపయోగం లేదని టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అన్నాడు. తాను హార్దిక్ పాండ్యాతో చాలా సమయం గడిపానని, కష్టకాలంలో తనకు అండగా నిలిచాడన్నాడు. మ్యాచులో త్వరగా ఔటైతే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. తనకు మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉందని ఇషాన్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికైన ఇషాన్.. సత్తా చాటి తిరిగి…