Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
తెలంగాణ ఉద్యమంలో సర్వం ఒడ్డి కొట్లాడిన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారని.. పార్టీల కంటే ప్రజల అవసరాలు ముఖ్యం అని చెప్పే వాళ్లే ఇక్కడ ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కృష్ణా నదీ జలాలపై ప్రగతి భవన్‌లో తెలంగాణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అజెండా ఎలా ఉంది.. రాజకీయ ఆర్థిక ప్రయోజనం ఏం పొందారు అనేది చర్చనీయాంశం కాదని.. ఇక్కడ తొమ్మిదిన్నరేళ్ళు.. కేసీఆర్…
బనకచర్ల పై అసెంబ్లీలో కేసీఆర్ చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు.
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్…
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది.
Harish Rao : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని మూడు దశల్లో బనకచర్ల వరకు తరలించేందుకు కేంద్రానికి PFR సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు…
KTR: కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో ముఖ్యంగా కొన్ని కీలకాంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఎంత వర్షం వచ్చినా, ఎంత వాటర్ ఫ్లో వచ్చినా కాళేశ్వరం తట్టుకుంది. అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు కావాలనే డామేజ్ చేసి ఉంటారు. నాకు అదే అనుమానం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read Also: Gold…
Harish Rao : తెలంగాణలో ప్రముఖ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పునః ప్రారంభమైంది. ఈ విచారణలో భాగంగా సోమవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. ఆయన గతంలో కేసీఆర్ కేబినెట్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హరీష్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు ఫిల్లర్లు…
Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ నిరసన కొనసాగుతోంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మరోసారి తమ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉంటే… అవి కూడా చేస్తాం. ఈ విషయంలో తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఇక రెండు రోజుల్లో ప్రాజెక్టుపై మరింత…
పంచభూతాలలో ఒకటైన నీటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను ఆనాడే మన పార్టీ అగ్రనేతలు గమనించారని అన్నారు. జల వనరులు ఉన్నచోటే నాగరికతలు వెల్లి విరుస్తాయనే చారిత్రక సత్యాన్ని మన పార్టీ ఆవిర్భావ దశలోనే గుర్తించింది.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై మన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పని చేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొ్న్నారు.