Bab el-Mandeb: ఇజ్రాయిల్-హమాస్ నేపథ్యంలో ఎర్ర సముద్రంతో పాటు అంతర్జాతీయ నౌకా రవాణాకు కీలకమైన పలు ప్రాంతాల్లో యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు, ఆ దేశంతో సంబంధం ఉన్న కార్గో నౌకలపై డ్రోన్లతో దాడులు జరుపుతుండటంపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Iran : ఇరాన్ ప్రపంచంలో నేరాల విషయంలో చాలా కఠినంగా ఉండే దేశం. డ్రగ్స్‌కు సంబంధించిన నేరాల్లో కూడా ఇక్కడ కఠినమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇరాన్లో అతిపెద్ద సమస్య నల్లమందు వినియోగానికి సంబంధించినది.
Red Sea: ప్రపంచ నౌకా వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇజ్రాయిల్ నుంచి వచ్చే నౌకలతో పాటు, రెడ్ సీలో ఇతర దేశాలకు చెందిన నౌకలపై కూడా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నారు.
ఎర్ర సముద్రం రణరంగంగా మారుతోంది. యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ సముద్రం గుండా వచ్చే వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఎదుర్కొనేందుకు అమెరికా మిలిటరీ ఆ ప్రాంతంలో మోహరించింది. రెడ్ సీలో కంటైనర్ షిప్‌లపై దాడులు చేస్తున్న ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగబాటుదారులు నిర్వహిస్తున్న మూడు నౌకల్ని ముంచేసినట్లు యూఎస్ నేవీ తెలిపింది. యూఎస్ నేవీ హెలికాప్టర్లు వీటిపై దాడి చేసినట్లు ఆదివారం వెల్లడించింది.
Iran: ఇటీవల అరేబియా సముద్రంలో భారత్ వైపు వస్తున్న కెమికల్ ట్యాంకర్ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ఎర్రసముద్రంలో భారత్‌కి వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగింది. అయితే భారత్ సమీపంలో అరేబియా సముద్రంలో జరిగిన దాడి ఇరాన్ పనే అని అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా ఆరోపణల్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణల్ని ‘విలువ లేనివి’గా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ సోమవారం ఖండించింది. పెంటగాన్ ఆరోపించిన తర్వాత టెహ్రాన్ నుంచి…
Iran: ఇస్లామిక్ రాజ్యం ఇరాన్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలుసు. అక్కడ కంటికి కన్ను అనే రీతిలో శిక్షలు ఉంటాయి. షరియా చట్టాన్ని పాటించే ఇరాన్లో ఏ దేశంలో లేనట్టుగా ఉరిశిక్షలను విధిస్తోంది. మైనర్లు, మేజర్లు అనే తేడా లేకుండా తప్పు ఎవరు చూసినా.. ఉరిశిక్షే గతి.
Iran Blast : ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ ఏవియేషన్ అండ్ స్పేస్ ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఇది జరిగింది. పేలుడు అనంతరం ప్రధాన కార్యాలయం నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొసాద్ ఏజెంట్‌ని ఇరాన్ ఉరితీసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఆగ్నేయ సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులో మొసాద్ ఏజెంట్‌ని శనివారం ఉరితీసింది. ఉరితీయబడిన వ్యక్తి విదేశాలకు సాయపడుతున్నాడని, ప్రత్యేకం మొసాద్ తో సంబంధాలు ఉన్నాయని, రహస్య సమాచారాన్ని సేకరించి,
Iran: భారతీయ సందర్శకులకు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే సందర్శకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ మంత్రివర్గం నిర్ణయించిందని ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటక మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి తెలిపారు. భారత్‌తో సహా 33 దేశాలకు వీసా నిబంధనలను రద్దు చేస్తూ ఇరాన్ బుధవారం నిర్ణయం తీసుకుంది.
Iran:ఇస్లామిక్, షరియా చట్టాలను పాటించే అరబ్ దేశాల్లో నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. అత్యాచారం, డ్రగ్స్ వినియోగం, హత్య వంటి నేరాలకు ఉరిశిక్ష విధిస్తుంటారు. తాజాగా ఓ 17 ఏళ్ల యువకుడికి ఇరాన్ ఉరిశిక్ష అమలు చేసింది. మైనర్ చేసిన నేరానికి ఉరిశిక్ష విధించడాన్ని హక్కుల సంఘాలు శనివారం తీవ్రంగా ఖండించారు. ఓ ఘర్షణలో మరో వ్యక్తిని హత్య చేసింనందుకు మైనర్కి మరణశిక్ష విధించింది.