Israel Iran War: యుద్ధం ఇలాగే కొనసాగితే వినాశనం తప్పదు.. గల్ఫ్ దేశం వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Iran War: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. కువైట్, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ ఘర్షణ ప్రారంభమై వారం గడుస్తోంది. ప్రతీ రోజూ కూడా అమాయకులు చనిపోతున్నారు. మరోవైపు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు సంక్షోభం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, ఖతార్ నుంచి హెచ్చరిక వచ్చింది. ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్ కాబి మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యం నుంచి ఇంధన సరఫరా నిలిచిపోతే, ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేయగలదని హెచ్చరించారు. “యుద్ధం వల్ల చమురు ఎగుమతులు ప్రభావితమైతే, ముడి చమురు ధరలు రాబోయే రెండు నుండి మూడు వారాల్లో బ్యారెల్‌కు $150 కంటే ఎక్కువగా పెరగవచ్చు” అని చెప్పారు. యుద్ధం ముగిసినప్పటికీ, చమురు సరఫరా సాధారణ స్థాయికి రావడానికి వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చని అన్నారు.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
Read ALSO: Sukhoi Crash: సుఖోయ్ విషాదం.. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న పైలట్ మృతి..
ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిదారుగా ఉన్న ఖతార్‌లోని ప్రధాన ఎల్‌ఎన్‌జి ప్లాంట్ అయిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఎల్‌ఎన్‌జి ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రపంచ గ్యాస్ సరఫరాను దెబ్బతీసింది. ఇదే కాకుండా యూఏఈ, సౌదీ అరేబియాల్లోని ఆయిల్ రిఫైనరీలను ఇరాన్ దెబ్బతీసింది.
ఇదిలా ఉంటే సంక్షోభాన్ని నివారించడానికి భారత్ చర్యలు తీసుకుంటోంది. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పెంచాలని భావిస్తోంది. మరోవైపు, యుద్ధం కారణంగా సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండటంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎల్‌పీజీ(LPG) కర్మాగారాలను ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!