Iran-Israel : ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనూహ్య మలుపు తిరగటానికి సిద్ధంగా ఉంది. ఒకటి రెండు రోజుల్లో అమెరికా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఎంటరైతే.. జరగబోయే పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకూ సిచ్యువేషన్ రూమ్ లో వ్యూహం ఖరారైందా..? అమెరికా ముందున్న ఆప్షన్లేంటి..? ఇరాన్ లో ఏం చేస్తే అమెరికాకు లాభం..? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆ రెండు దేశాల పరిధి దాటిపోయింది. ఇప్పుడు యుద్ధం కొనసాగింపు, ముగింపుపై అమెరికాదే తుది నిర్ణయం…
Russia: ఇజ్రాయిల్ ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో రష్యా అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వివాదంలో యూఎస్ సైనిక జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది. ‘‘ ఈ పరిస్థితిలో సైనిక జోక్యం ఉండకూడదు. ఇది నిజంగా అనూహ్యమైన, ప్రతికూల పరిణామాలతో కూడిన అత్యంత ప్రమాదకర చర్య అవుతుంది’’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా అన్నారు.
Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఘర్షణ 5వ రోజుకు చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ కారణంగా మధ్యప్రాచ్యంతో పాటు ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉంటే, ఈ ఘర్షణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి విరామం అవసరం లేదని చెప్పారు.
Iran-Israel conflict: ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు.. ఇరాన్ టాప్ కమాండర్ అలీ షాద్మానీ ప్రాణాలు వదిలారు.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మొదలైన యుద్ధం తాజాగా భీకర స్థాయికి చేరింది. ఇరు దేశాలు నువ్వానేనా అన్నట్టుగా దాడులు చేసుకుంటున్నాయి.
Donald Trump: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతి దాడుల మధ్య మిడిల్ ఈస్ట్ సంక్షోభం ముదిరింది. శుక్రవారం ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై విరుచుకుపడింది. ఇదే కాకుండా ఇరాన్ మిలిటరీ టాప్ జనరల్స్‌తో పాటు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్ లోని ప్రధాన నగరాలైన జెరూసలెం, టెల్ అవీవ్, హైఫా నగరాలపై వందలాది క్షిపణులతో విరుచుకుపడింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 24 గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది. శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా హతమయ్యారు. ఇక తాజాగా శనివారం మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.