యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో కలిసి మ్యాచ్ చూశాడు. టీమ్ కుక్ తో పాటు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు.
ఐపీఎల్ 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా మరో మ్యాచ్ జరగబోతోంది.. ముంబై ఇండియన్స్‌తో హైదరాబాద్ సన్‌రైజర్స్ ఢీకొనబోతోంది.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రెండు జట్ల ప్రదర్శనకు పెద్ద తేడా ఏమీ లేదు.. ముంబై నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు సాధించగా.. హైదరాబాద్ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది.. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు కిందినుంచి వరుసగా రెండు, మూడో స్థానాలకే పరిమితం అయ్యాయి.. అయితే, హైదరాబాద్‌లోని…
రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ అదరగొట్టింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు.
ఐపీఎల్ సీజన్-16లో భాగంగా ఇవాళ అస్సాం రాష్ట్రం గౌహతిలోని బర్సపారా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ట్రెంట్ బౌల్డ్ వేసిన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఐపీఎల్-15 సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్, రాజస్థాన్… తొలి క్వాలిఫయర్ ఆడనున్నాయి. ఇవాళ సాయంత్రం జరగబోయే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో… ఎవరు విజయం సాధించి… ఫైనల్‌కు చేరుకుంటారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. రెండు జట్లు… లీగ్‌లో అద్భుతంగా ఆడాయి. హర్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ జట్టు లీగ్ ప్రారంభం నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్ స్థానంలోకి దూసుకెళ్లింది. 14 లీగ్ మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో…
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఇవాళ ఢీకొడుతున్నాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నట్లు పంత్ తెలిపాడు. పంజాబ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. మయాంక్ తిరిగి రావడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.…
ఐపీఎల్ లో ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో షార్జా వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు రాజస్తాన్ రాయల్స్ జట్టును ఎదుర్కోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే… రెండు టీమ్స్ కి ఇది కీలక మ్యాచ్. ఇందులో ఎవరు ఓడిపోయినా వారు ఇంటికే. ఇక ప్రస్తుతం 10 పాయింట్స్ తో 6వ స్థానంలో రాజస్తాన్, 7వ స్థానంలో ముంబై జట్టు ఉంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లో 23 సార్లు హెడ్ టు హెడ్ ముంబై, రాజస్తాన్…