ఐపీఎల్ లో ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో షార్జా వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు రాజస్తాన్ రాయల్స్ జట్టును ఎదుర్కోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే… రెండు టీమ్స్ కి ఇది కీలక మ్యాచ్. ఇందులో ఎవరు ఓడిపోయినా వారు ఇంటికే. ఇక ప్రస్తుతం 10 పాయింట్స్ తో 6వ స్థానంలో రాజస్తాన్, 7వ స్థానంలో ముంబై జట్టు ఉంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లో 23 సార్లు హెడ్ టు హెడ్ ముంబై, రాజస్తాన్ తలపడగా ముంబై 12 సార్లు విజయం సాధించగా 11 సార్లు రాజస్థాన్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో గెలితేనే ప్లే ఆఫ్స్ లో అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని రెండు జట్లు చుస్తున్నాయి. చూడాలి మరి ఈరోజు ఏం జరుగుతుంది అనేది.