భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో భారత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ ముగిసింది. ఆ తర్వాత అభిమానులు ఎదురుచూసేది ఐపీఎల్ కోసం. 2024 ఐపీఎల్ వేలం వచ్చే నెలలో నిర్వహించనున్నారు. అందులో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కాసుల వర్షం కురవడం…
IPL Auction 2023: ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఐపీఎల్ 2023 టైటిల్ లక్ష్యంగా అన్ని జట్లు వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అయితే మినీ వేలం ముగిసిన తర్వాత ఎప్పటి లాగానే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పటిష్టంగా కనిపిస్తున్నాయి. మినీ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.16.25 కోట్లు ఖర్చు చేసింది. వేలంలో ఓ ఆటగాడి కోసం చెన్నై ఇంత పెద్ద మొత్తంలో…
IPL Auction: ఈనెల 23న కేరళలోని కొచ్చి వేదికగా ఐపీఎల్-2023 సీజన్‌కు సంబంధించి మినీ వేలం జరగనుంది. మొత్తం 991 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మినీ వేలానికి రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మంది ఆటగాళ్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేశాయి. ఇందులో గరిష్టంగా 87 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు. షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్…
IPL 2023: కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ బోసిపోయింది. మ్యాచ్‌లన్నీ ఒకే చోట లేదా పరిమిత స్టేడియాలలో నిర్వహిస్తుండటం వల్ల ఐపీఎల్ కళ తప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 2023 సీజన్‌ను హోమ్ అండ్ అవే పద్ధతిలో నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. అంతేకాకుండా 2023 సీజన్ కోసం బీసీసీఐ మినీ వేలం ప్రక్రియను నిర్వహించబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 16న బెంగళూరు వేదికగా ఐపీఎల్ మినీ వేలం…
ఐపీఎల్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభిస్తుంది. వరల్డ్‌వైడ్‌గా పేరుగాంచిన ప్రముఖ క్రికెటర్లు ఈ లీగ్‌లో భాగం అవుతారు. అందుకే, ఈ లీగ్ చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు ఎగబడతారు. అంతటి క్రేజ్ కలిగిన ఈ లీగ్ ప్రసార హక్కులకు డిమాండ్ మామూలుగా ఉంటుందా? వేల కోట్లు దాటాల్సిందే! ఈసారి ఐపీఎల్ ప్రసార (టీవీ, డిజిటల్) హక్కులైతే హిస్టారికల్ రేటుకు అమ్ముడుపోయాయి. ముంబై వేదికగా బీసీసీఐ ఈ-వేలం…
ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మెగా వేలంలో జాక్‌పాట్ తగిలింది. అండర్-19 టీమిండియా కెప్టెన్ యశ్ ధుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. అటు ఆల్‌రౌండర్ రాజ్ బవాను పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ వేయగలడు. అంతేకాకుండా మిడిల్ ఓవర్లలో పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ కూడా చేయగలడు. అందుకే పంజాబ్ కింగ్స్ అతడిని రూ.2 కోట్లకు దక్కించుకుంది. అండర్-19…
ఈరోజు ఐపీఎల్-15వ సీజన్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఫ్రాంచైజీలు రూ.560 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ వేలంలో తొలి ప్రాధాన్య సెట్‌లోని తొలి లాట్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితా బయటకు వచ్చింది. వీరంతా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు పలుకుతుండటం విశేషం. ఈ జాబితాలో…
భారత్‌లో సినిమాలు, క్రికెట్‌ను వేరు చేసి చూడలేం. ఐపీఎల్ ప్రాంరంభమైనప్పటి నుంచి ఐపీఎల్ జరిగినన్ని రోజులు క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగ ఇది. అయితే ఐపీఎల్-2022 మెగా వేలం వచ్చే నెలలో జరగబోతుంది. ఇందుకోసం ఆటగాళ్ల పూర్తి జాబితా వచ్చేసింది. ఈ లీగ్ కోసం 1,214 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 896 మంది భారత ఆటగాళ్లు కాగా 318 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 10 జట్లు…
వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ కోసం మెగవేలం జరగనున్న విషయం తెలిసిందే. అయితే గత 14 సీజన్ ల నుండి 8 జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్ లో ఐపీఎల్ 2022 నుండి మరో రెండు జట్లు కలిసి మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ నెలలో ఈ రెండు కొత్త జట్ల వేలం కూడా జరిగిపోయింది. అయితే ఈ కొత్త జట్ల రాకతో ఐపీఎల్ 15 వ సీజన్ కోసం మెగా వేలం నిర్వహిస్తుంది…