ఐపీఎల్ మెగా వేలం రెండు రోజు కొనసాగనుంది. తొలి రోజు వేలంలో ఆటగాళ్లు.. కోట్లు కొల్లగొట్టగా, ఈరోజు కూడా అదే స్థాయిలో ఆటగాళ్లు అమ్ముడుపోనున్నారు. తొలిరోజు 84 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరిగింది. ఫ్రాంచైజీలు ఆదివారం మొత్తం రూ.467.95 కోట్లు ఖర్చు చేశారు. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో వేలం జరుగనుంది.
కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్‌కీ బాత్‌లో మోడీ ఏం మాట్లాడారంటే? మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఈరోజు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డే సందర్భంగా ఆయన తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. దేశంలోని యువత కూడా ఎన్‌సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారత్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో 1,574 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. 16 విదేశాలకు చెందిన ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 409 విదేశీ ప్లేయర్స్ వేలంలో అందుబాటులో ఉన్నారు. జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, నాథన్ లైయన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి విదేశీ స్టార్ ప్లేయర్స్‌పై అందరి దృష్టి ఉంది. మరో విదేశీ ఆటగాడు కూడా హైలెట్‌గా నిలవనున్నాడు. అతడే 24 ఏళ్ల ఫాస్ట్…
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. చాలామంది స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. 2021 నుంచి జట్టులో ఉన్న ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకోలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్‌సీబీ తనను అట్టిపెట్టుకోవడంపై తాజాగా మ్యాక్సీ స్పందించాడు.…
ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం జరగనుంది. వేలంకు ముందు రిటెన్షన్ జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు (అక్టోబర్ 31) చివరి గడువు కాగా.. ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను విడుదల చేశాయి. ఇక నవంబర్ చివరలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. రిటెన్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు) అత్యధిక ధర దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీని రూ.21 కోట్లకు బెంగళూరు రిటైన్ చేసుకుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (రూ.16.30…
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితా ప్రకటనకు బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తన రిటైన్ జాబితాను ప్రకటించింది. ముంబై ఓనర్ ఆకాష్ అంబానీ జట్టును సోషల్ మీడియాలో ప్రకటించారు. జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా,…
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవలే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్.. ఆ ఫ్రాంచైజీని వీడనున్నట్లు తెలుస్తోంది.…
ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) తన కెప్టెన్‌ను వదిలేసేందుకు సిద్దమైందట. ఐపీఎల్ 2024…