IPL Purple Cap Holders: బ్యాట్స్మెన్స్ దూకుడికి కళ్లెం వేసి ఐపీఎల్ చరిత్రలో ‘పర్పుల్ క్యాప్’ సాధించిన ఘనులు వీరే
- ప్రతీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ అందచేత.
- 2013లో డ్వేన్ బ్రావో, 2021 సీజన్లలో హర్షల్ పటేల్ ఒక సీజన్ లో 32 వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించారు.
- ఐపీఎల్ చరిత్రలో డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లు చెరో రెండేసి సార్లు పర్పుల్ క్యాప్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Purple Cap Winners: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ ను అందజేస్తారన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ అంటేనే బ్యాట్స్మెన్ హవా కొనసాగుతుంది. బంతి బంతికి పరుగు తీసేందుకు ప్రయత్నించే ఈ టి20 ఫార్మేట్ లో బ్యాట్స్మెన్ దూకుడుకి కళ్లెం వేసి వికెట్లను సాధించడం అంత ఆషామాసి విషయం కాదు. కాబట్టి, ప్రతి సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఐపీఎల్ పర్పుల్ క్యాప్ అందజేస్తుంది. మరి ఇది వరకు జరిగిన 17 ఐపీఎల్ సీజన్లలో ఎవరెవరు ఎన్నిసార్లు పర్పుల్ క్యాప్ అందుకున్నారో చూద్దామా..
Read Also: IPL Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్లు వీరే
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
* 2024: హర్షల్ పటేల్ (పంజాబ్) – 24 వికెట్లు (14 మ్యాచ్‌లు),
* 2023: మొహమ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్) – 28 వికెట్లు (17 మ్యాచ్‌లు),
* 2022: యుజ్వేంద్ర చాహల్ (రాజస్థాన్ రాయల్స్) – 27 వికెట్లు (17 మ్యాచ్‌లు),
* 2021: హర్షల్ పటేల్ (బెంగళూరు) – 32 వికెట్లు (15 మ్యాచ్‌లు),
* 2020: కగిసో రబాడా (పంజాబ్) – 30 వికెట్లు (17 మ్యాచ్‌లు),
* 2019: ఇమ్రాన్ తాహిర్ (చెన్నై సూపర్ కింగ్స్) – 26 వికెట్లు (17 మ్యాచ్‌లు),
* 2018: ఆండ్రూ టై (రాజస్థాన్ రాయల్స్) – 24 వికెట్లు (14 మ్యాచ్‌లు),
* 2017: భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 26 వికెట్లు (14 మ్యాచ్‌లు),
Read Also: Spain: రవాణా రంగంలో అద్భుతం.. దేశంలో డ్రైవర్ రహిత మినీ బస్సు పరుగులు..
* 2016: భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 23 వికెట్లు (17 మ్యాచ్‌లు),
* 2015: డ్వేన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్) – 26 వికెట్లు (17 మ్యాచ్‌లు),
* 2014: మోహిత్ శర్మ (చెన్నై సూపర్ కింగ్స్) – 23 వికెట్లు (16 మ్యాచ్‌లు),
* 2013: డ్వేన్ బ్రావో (చెన్నై సూపర్ కింగ్స్) – 32 వికెట్లు (18 మ్యాచ్‌లు),
* 2012: మోర్నే మోర్కెల్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) – 25 వికెట్లు (16 మ్యాచ్‌లు),
* 2011: లసిత్ మలింగ (ముంబై ఇండియన్స్) – 28 వికెట్లు (16 మ్యాచ్‌లు),
* 2010: ప్రగ్యాన్ ఓజా (డెక్కన్ ఛార్జర్స్) – 21 వికెట్లు (16 మ్యాచ్‌లు),
* 2009: ఆర్‌పీ సింగ్ (డెక్కన్ ఛార్జర్స్) – 23 వికెట్లు (16 మ్యాచ్‌లు),
* 2008: సోహైల్ తన్వీర్ (రాజస్థాన్ రాయల్స్) – 22 వికెట్లు (11 మ్యాచ్‌లు).
మొత్తానికి ఐపీఎల్‌లో పర్పుల్ క్యాప్ గెలుచుకోవడం ఒక బౌలర్‌కు అతని అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా నిలుస్తుంది. 2013లో డ్వేన్ బ్రావో, 2021 సీజన్లలో హర్షల్ పటేల్ ఒక సీజన్ లో 32 వికెట్లతో అత్యధిక వికెట్ల తీసి రికార్డు సాధించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో డ్వేన్ బ్రావో, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లు చెరో రెండేసి సార్లు పర్పుల్ క్యాప్ సంపాదించారు. మరి ఐపీఎల్ 2025 సీజన్‌లో అత్యుత్తమ బౌలర్‌గా ఎవరు అవుతారని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..