Orange Cap Holders: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రతి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ను ఆరెంజ్ క్యాప్ తో గౌరవిస్తుంది. ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం ఓ బ్యాట్స్‌మన్‌కి తన కెరియర్లో మరింత ముందుకు వేలెందుకు ఎంతగానో సహాయపడుతుంది. గత 17 సంవత్సరాల్లో ఈ జాబితాలో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు తమ ముద్ర వేశారు. ప్రత్యేకంగా, విరాట్ కోహ్లీ 2016లో 973 పరుగులు చేసి ఇప్పటివరకు అత్యధిక పరుగుల రికార్డు కైవసం చేసుకున్నాడు. 2024లో మరోసారి అతను ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన విరాట్ కోహ్లీ 15 మ్యాచ్‌లలో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. మరి మిగితా సీజన్స్ లో ఎవరెవరు ఎప్పుడు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారంటే..
Read Also: IML T20 2025 Final: నేడే ఇండియా – వెస్టిండీస్ ఫైనల్ మ్యాచ్.. లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?
గత ఐపీఎల్ సీజన్లలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాళ్లు..
* 2024: విరాట్ కోహ్లీ (ఆర్‌సీబీ) – 741 పరుగులు (15 మ్యాచ్‌లు),
* 2023: శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – 890 పరుగులు (17 మ్యాచ్‌లు),
* 2022: జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్) – 863 పరుగులు (17 మ్యాచ్‌లు),
* 2021: రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) – 635 పరుగులు (16 మ్యాచ్‌లు),
* 2020: కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్) – 670 పరుగులు (14 మ్యాచ్‌లు),
* 2019: డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 692 పరుగులు (12 మ్యాచ్‌లు),
* 2018: కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 735 పరుగులు (17 మ్యాచ్‌లు),
Read Also: Sleeping Problems : ప్రెగ్నెన్సీ లో నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..!
* 2017: డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 641 పరుగులు (14 మ్యాచ్‌లు),
* 2016: విరాట్ కోహ్లీ (ఆర్‌సీబీ) – 973 పరుగులు (16 మ్యాచ్‌లు),
* 2015: డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 562 పరుగులు (14 మ్యాచ్‌లు) ,
* 2014: రోబిన్ ఉతప్ప (కోల్‌కతా నైట్ రైడర్స్) – 660 పరుగులు (16 మ్యాచ్‌లు),
* 2013: మైఖేల్ హస్సీ (చెన్నై సూపర్ కింగ్స్) – 733 పరుగులు (17 మ్యాచ్‌లు),
* 2012: క్రిస్ గేల్ (ఆర్‌సీబీ) – 733 పరుగులు (15 మ్యాచ్‌లు),
* 2011: క్రిస్ గేల్ (ఆర్‌సీబీ) – 608 పరుగులు (12 మ్యాచ్‌లు),
* 2010: సచిన్ టెండూల్కర్ (ముంబై ఇండియన్స్) – 618 పరుగులు (15 మ్యాచ్‌లు),
* 2009: మాథ్యూ హేడెన్ (చెన్నై సూపర్ కింగ్స్) – 572 పరుగులు (16 మ్యాచ్‌లు),
* 2008: షాన్ మార్ష్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) – 616 పరుగులు (11 మ్యాచ్‌లు).