Rahul Dravid: నడవలేని స్థితిలో మైదానంలోకి రాహుల్ ద్రవిడ్.. దటీజ్ ‘ది వాల్’!
- ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం
- 23న రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్
- నడవలేని స్థితిలో మైదానంలోకి రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంకితభావానికి మారు పేరు ద్రవిడ్. ఆటగాడిగా భారత జట్టు తరఫున ఇది ఎన్నోసార్లు నిరూపించాడు. ఇప్పుడు కోచ్‌గానూ అదే నిబద్ధతను ప్రదర్శిస్తున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్.. గురువారం చేతి కర్రల సాయంతో టీమ్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. గాయమైన కాలికి స్పెషల్ బూట్ వేసుకుని.. కర్రల సాయంతో నడుచుకుంటూ మైదానంలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది.
రాహుల్ ద్రవిడ్ ఇటీవల బెంగళూరులో విజయ సీసీ తరఫున జయాంగర్ క్రికెటర్స్ జట్టుతో క్లబ్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ద్రవిడ్ ఎడమ కాలి పిక్క కండరానికి గాయమైంది. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ఐపీఎల్ 2025కి సమయం దగ్గరపడడంతో.. గోల్ఫ్ కార్ట్‌లో మైదానంలోకి వచ్చి రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్స్ ఆట తీరును పరిశీలించాడు. యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్‌తో సుదీర్ఘంగా మాట్లాడాడు. ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం కానుండగా.. 23న రాజస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. రెండేళ్లు టీమిండియా కోచ్‌గా ఉన్న ద్రవిడ్.. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..