ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 రన్స్ చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ పరాగ్ బ్యాట్ ఝులిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై ఒక్కసారిగా గేరు మార్చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదాడు. స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన 13 ఓవర్‌లో వరుసగా ఐదు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు.
13వ ఓవర్ మొదటి బంతికి షిమ్రాన్ హెట్‌మయర్ సింగిల్ తీసి ఇవ్వగా.. రియాన్ పరాగ్ పూనకం వచ్చినట్లుగా 2, 3, 4, 5, 6 బంతులకు సిక్సులు బాదాడు. దీనికి తోడు ఈ ఓవర్లో మొయిన్ ఓ వైడ్ కూడా వేశాడు. దాంతో ఈ ఓవర్‌లో మొత్తం 32 రన్స్ వచ్చాయి. వరుసగా ఐదు సిక్స్‌లు బాదిన వేళ రియాన్ పరాగ్‌కు చెందిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఈ ఐపీఎల్‌లో ఏదో ఓ సమయంలో ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు కొడతానని నా మనసు చెబుతోంది’ అని 2023లో పరాగ్ చెప్పినట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. ‘2023లో చెప్పాడు, 2025లో బాదాడు’, ‘రియాన్ పరాగ్ తోపెహే’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: KKR vs RR: ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో కేకేఆర్ విజయం.. రియాన్ పరాగ్ మెరుపులు వృధా!
ఐపీఎల్‌లో ఇంతకుముందు ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు నలుగురు బాదారు. క్రిస్ గేల్ (రాహుల్ శర్మ, 2012), రాహుల్ తెవాటియా (ఎస్ కాట్రెల్, 2020), రవీంద్ర జడేజా (హర్షల్ పటేల్, 2021), రింకు సింగ్ (యష్ దయాల్, 2023)లు ఉన్నారు. తాజాగా రియాన్ పరాగ్ (మోయిన్ అలీ, 2025) ఐదు సిక్సర్లు బాదాడు.
Riyan Parag manifested in 2023 – turned into a reality in 2025. 🙇♂️ pic.twitter.com/XeFphvcbGg
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2025
RIYAN PARAG SMASHED 5 CONSECUTIVE SIXES AGAINST MOEEN ALI…!!! 🤯 pic.twitter.com/RCqdav36qz
— Johns. (@CricCrazyJohns) May 4, 2025