PBKS vs LSG: ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటర్లు సిక్సర్లతో రెచ్చిపోయారు. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, పంజాబ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ జట్టు 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పంజాబ్ తరఫున ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడు కేవలం 48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 91 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో ఇతర బ్యాటర్ల సహకారం అతనికి బాగా కలిసి వచ్చింది. జోష్ ఇంగ్లిస్ (14 బంతుల్లో 30), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 బంతుల్లో 45), షశాంక్ సింగ్ (15 బంతుల్లో 33 నాటౌట్), మార్కస్ స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్) వేగంగా పరుగులు చేసి పంజాబ్ కింగ్స్ ను భారీ స్కోరు దిశగా నడిపారు. చివర్లో నేహాల్ వాధేరా కూడా 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
Read Also: Hari Hara Veera Mallu: “హరి హర వీరమల్లు”పై క్రేజీ అప్డెట్.. షుటింగ్‌కి హాజరైన పవన్ కళ్యాణ్..
ఇక లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ మినహా ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. అతను 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దిగ్వేశ్ రాథీకి కూడా 2 వికెట్లు దక్కాయి కానీ భారీగా పరుగులు ఇచ్చాడు. అలాగే ప్రిన్స్ యాదవ్‌కు ఒక్క వికెట్ దక్కింది. మిగతా బౌలర్లు మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ వికెట్ తీయలేక భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో గెలవాలంటే లక్నో సూపర్ జెయింట్స్ 237 పరుగులు చేయాల్సి ఉంది.